జగన్ పాదయాత్రలో వివాదం

Published : Nov 11, 2017, 03:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
జగన్ పాదయాత్రలో వివాదం

సారాంశం

కొనసాగుతున్న జగన్ పాదయాత్ర పాదయాత్రలో వివాదం కార్యకర్తలను అడ్డుకున్న జగన్ భద్రతా సిబ్బంది

వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రలో వివాదం చోటుచేసుకుంది. జగన్ భద్రతా సిబ్బందికి, ఆయన అభిమానులకు చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే.. గత నాలుగు రోజులుగా జగన్ ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిరోజు ఇడుపులపాయలో మొదలుపెట్టిన ఈ యాత్ర శనివారం  కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం వద్దకు చేరుకుంది. అయితే... జగన్ దగ్గరకు వెళ్లేందుకు వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున వచ్చారు. దీంతో వారందరినీ జగన్ భద్రతా సిబ్బంది తోసేసారు. ఆగ్రహానికి గురైన వైసీపీ కార్యకర్తలు.. భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో తోపులాట జరిగింది. అనంతరం జగన్ దగ్గరకు తమను అనుమతించలేదంటూ వైసీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !