నూతన కాగ్ గా బాధ్యతలు చేపట్టనున్న రాజీవ్ మెహ్రిషి

Published : Sep 24, 2017, 11:21 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
నూతన కాగ్ గా బాధ్యతలు చేపట్టనున్న రాజీవ్ మెహ్రిషి

సారాంశం

నూతన కాగ్ గా రాజీవ్ మెహ్రిషి రేపు బాధ్యతలు చేపట్టనున్న రాజీవ్ మెహ్రిషి

హోంశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి.. భారత నూతన కాగ్ గా బాధ్యతలు చేపట్టున్నారు. ప్రస్తుత కాగ్ గా ఉన్న  శశికాంత్  శర్మ పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. దీంతో తాజా కాగ్ గా రాజీవ్ ని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి భవన్ లో సోమవారం రాజీవ్ మెహ్రిషి(62).. రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ ఆధ్వర్యంలో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

రాజీవ్ మెహ్రిషి.. 1978వ బ్యాచ్ కు చెందిన రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారి. గతంలో ఆయన హోం శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రెండు సంవత్సరాలుగా ఆ భాధ్యతలు నిర్వర్తించిన ఆయన గత నెలలో కార్యదర్శిగా తన పదవీ కాలం ముగిసింది. తాజాగా.. ఇప్పుడు ఆయనకు కాగ్ బాధ్యతలు అప్పగించారు.

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులు, ఖాతాలను తనిఖీ చేసి  కేంద్ర ప్రభుత్వ నివేదికను రాష్ట్రపతికి, రాష్ట్ర ప్రభుత్వాల నివేదిక  గవర్నర్లకు అందజేయడమే  కాగ్( కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) విధి.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !