చిన్నమ్మే పెద్దమ్మ?: ఆదివారం ముహూర్తం

Published : Feb 04, 2017, 07:18 AM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
చిన్నమ్మే పెద్దమ్మ?: ఆదివారం ముహూర్తం

సారాంశం

చిన్నమ్మ శశికళ ముఖ్యమంత్రి  అయ్యేందుకు రంగం తయారయింది. అదివారం ఈ పెనుమార్పు జరుగనుంది

తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించ నున్నట్లు జోరుగా ఊహాగానాలు వినబడుతున్నాయి. ఇందులో భాగంగానే ఆదివారం నాడు ఏఐఏడిఎంకె శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. ఆ సమావేశంలో శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అందుకు అవసరమైన రంగం మొత్తాన్ని శశికళ మద్దతుదారులు ఇప్పటికే పూర్తి చేసినట్లే కనబడుతోంది. 

 

పార్టీ వర్గాల ప్రకారం జయలలితవిధేయుడయిన పన్నీర్ సెల్వం తక్షణం తప్పుకుంటానని సమావేశం చెబుతారు. పన్నీర్ సెల్వం గత డిసెంబర్ 9న  ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.

 

రేపటిసమావేశంలో శశికళను శాసన సభాపక్ష నాయకురాలిగాఎంపికయితే,  అమె ఫిబ్రవరి 9న  పదవీ బాధ్యతలు స్వీకరించేందుకుముహుర్తం ఖరారయింది. తర్వాత జయ నియోజకవర్గమయిన రాధాకృష్ణ నగర్ నుంచి ఉప ఎన్నికలో నిలబడతారు.

 

శశికళ సిఎం : క్యాంపెయిన్ మొదలు 

 

జయలలిత విధేయులయిన శీలా బాలకృష్ణన్ వంటి  కొంతమంది సీనియర్ అధికారులను శుక్రవారం రాత్రి హఠాత్తగా తప్పించడం  శశికళ పట్టాభిషేకం అనుమానాలను బలపరుస్తూ ఉంది.

 

గత కొద్ది రోజులు పార్టీలో శశిఅనుకూల మార్పులు చాలా వస్తున్నాయి మాజీ మంత్రులు కె ఎ సెంగొట్టియణన్, ఎస్ గోకుల ఇందిర, బివి రమణ, మాజీ మేయర్  సైదై దురైసామి లను పార్టీ కార్శదర్శులుగా నియమించారు. మత్స్య  పరిశ్రమ శాఖ మంత్రి డి. జయకుమార్ కు  కూడా ఆమె పార్టీ బాధ్యతలప్పగించారు.

 

పార్టీ యువజన విభాగం కార్యదర్శి పదవినుంచి అంబత్తూర్ ఎమ్మెల్యే వి అలెగ్జాండర్ ను కూడా తొలగించారు.

 

గత నెల రోజులుగా  పార్టీలో శశికళ  ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించాలనే క్యాంపెయిన్ నడుస్తూ ఉంది.

 

ఈహఠాత్పరిణామం తమిళనాడులో వీస్తున్న శశికళ వ్యతిరేక పవనాలను ఎదుర్కొనేందుకే నని  కొందరు అంటున్నారు. ఎందుకంటే, జయ మేనకోడలుదీప బాణం ఎక్కుపెట్టింది శశికళ మీదే. అదే విధంగా శశికళ,అమె కొడుకుమీద కేసులు నమోదయ్యాయి. వీటిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి కావడం అవసరం. హోదా కొంత రక్షణ నిస్తుంది.

 

ఈ వాదనతో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. డిసెంబర్ 31 పార్టీ కార్యాలయంలోకి శశికళ కాలుపెట్టినపుడు పన్నీర్ సెల్వం కూడా ఆమె నాయకత్వాన్ని అంగీకరించి,  తాను పార్టీ కోశాధికారిని మాత్రమేనని కూడా ప్రకటించుకున్నారు.‘ అమ్మకు తోబుట్టువుగా పుట్టక పోయినా, ఆమె (శశికళ)  పార్టీ కోసం ఎంతో శ్రమించి, కొవ్వొత్తిలా కరిగిపోతూ, అమ్మని పార్టీని కాపాడారు,’అని ఆయన ఆమెను  కొనియాడారు.

 

చిన్నమ్మకే పార్టీ పగ్గాలు

 

జయలలిత తొలిమాసికం లోపేశశికళ పార్టీపై తన  పట్టు బిగించారు. ప్రభుత్వంలోకి తన ప్రాబల్యాన్ని చొప్పించారు. ఆమె పేరు మీద వెలువడుతున్నపోస్టర్లు, బ్యానర్లు, సంక్షిప్త చిత్రం, జ్ఞాపికలు పెరిగిపోయిన ఆమె పలుకుబడికి చిహ్నాలు,

 

 

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !