ప్రతిపక్ష పాత్రలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు

Published : Nov 10, 2017, 10:08 AM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
ప్రతిపక్ష పాత్రలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు

సారాంశం

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష నేతలు లేకుండా మొదలైన సభ అధికార పార్టీ నేతలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారన్న లోకేష్

 అధికార పార్టీ నేతలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని  ఏపీ మంత్రి లోకేష్ తెలిపారు.ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈనెల 25 వరకు సభ నిర్వహించనున్నారు. మొత్తం పది రోజుల పాటు జరగనున్న  ఈ అసెంబ్లీ సమావేశాల్లో.. 11, 12,16,17,18,19 తేదీల్లో సభకు సెలవుగా ప్రకటించారు.

ఈ విషయమై మంత్రి లోకేష్ మాట్లాడారు. సభలో మొత్తం 27 అంశాలు ప్రస్తావించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష నేతలు బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని లోకేష్ తెలిపారు.  మంత్రులపై ప్రశ్నలు సంధించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు లోకేష్ పేర్కొన్నారు. కాగా.. అధికార పార్టీ నేతలే ప్రతి పక్ష పాత్ర పోషించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !