(వీడియో) ఇదిగో ఈ అమ్మడు ఇలా మ్యాన్ హోల్ లో పడిపోయింది..

Published : Jun 10, 2017, 02:09 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
(వీడియో) ఇదిగో ఈ అమ్మడు ఇలా మ్యాన్ హోల్ లో పడిపోయింది..

సారాంశం

చేతిలో మొబైల్  ఉంటే చాలా మంది ప్రపంచం మర్చిపోతుంటారు, ఇలా ఈ వీడియోలో ఉన్న అమ్మడిలాగా. మొన్నామధ్య మంబాయిలో ఒకమ్మాయి ఫోన్ లో మాట్లాడుతూ రైలు పట్టాలు దాటబోయి, రైలు కింద పడిన వీడియో చూశాం కదా. న్యూజెర్సీప్లెయిన్ ఫీల్డ్ ఏరియాలో గురువారం ఒకామె ఇలా మొబెల్ ముచ్చట్లలో వొళ్లు మరచిపోయి, ఫుట్ పాత్ పై నడుస్తూ...నడుస్తూ... నడుస్తూ...ఉంటే ...

చేతిలో మొబైల్ లో  చాలా మంది ప్రపంచం మర్చిపోతుంటారు, ఇలా ఈ వీడియోలో ఉన్న అమ్మడిలాగా. మొన్నామధ్య మంబాయిలో ఒకమ్మాయి ఫోన్ లో మాట్లాడుతూ రైలు పట్టాలు దాటబోయి, రైలు కింద పడిన వీడియో చూశాం కదా.  

న్యూజెర్సీప్లెయిన్ ఫీల్డ్ ఏరియాలో గురువారం (జూన్ 8) నాడు ఈ మహిళకూడా మొబైల్ మునిగిపోయి, ముందు పక్కన ఏముందో కూడా గమనించలేని స్థితిలో నడుచుకుంటూ వెళ్లింది.  షాపింగ్ కోసం వచ్చింది. పనై పోయాక  మొబెల్ ముచ్చట్లో వొళ్లు మరచిపోయి, ఫుట్ పాత్ పై నడుస్తూ ఉంది. నడుస్తూ... నడుస్తూ...ఉంటే ఏమయిందో మీరే చూడండి.

 

ఫుట్ పాత్ మీద ఒక గుంత ఉంది. దానికి తలుపులూ ఉన్నాయి. అయితే ఏదో పని కోసం ఈ మ్యాన్ హోల్ తెరిచి ఉంచారు. ప్రజల సౌకర్యార్థం ఒక డేంజర్ బోర్డు కూడా పెట్టారు.

మొబైల్ ముచ్చటలో  గుంత చూల్లేదు, అక్కడున్న డేంజర్ బోర్డు చూల్లేదు. అంతే, ఇలా అరడుగుల లోతులో పడిపోయింది.

అయితే, అందులో పనోళ్లున్నారు కాబట్టి సరిపోయింది. వాళ్లు వెంటనే  రెస్క్యూ టీమ్ కి ఫోన్ చేశారు.  వాళ్లొచ్చి బయటకు తీసుకువచ్చారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu