విశాఖ నడిబొడ్డున ఎన్టీఆర్ కు అవమానం

First Published May 29, 2017, 3:20 PM IST
Highlights

విగ్రహానికి చీరెలు,లుంగీలు,తెలుగుదేశంజండా చుట్టి నీచంగా తయారుచేశారు. ఇదంతా ముఖమంత్రి చంద్రబాబునాయుడు ఊర్లో ఉండగానే జరిగింది. జండా చుట్టి ముఖం కనబడకుండా చేశారు. నడుంకు పాత చీర చుట్టారు. కింద లుంగీ కట్టారు. చేతులకు కూడా టిడిపి జండానే  చుట్టేశారు. ఛాతీ మీద మరొక రంగు చీర కప్పారు.

ఎవరో గుర్తు తెలియని వ్యక్తులైనా , మూడేళ్లుగా ముసుగులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి విముక్తి కలిగించారులే అని విశాఖ ప్రజలు సంతోషిస్తున్నపుడు, ఆయన తీరని అవమానం ఎదురయింది.

 

విశాఖ న్యూరైల్వే కాలనీ జంక్షన్ వద్ద ఉన్న ఈ విగ్రహాన్ని చీరెలు,లుంగీలు,తెలుగుదేశంజండా చుట్టి నీచంగా తయారుచేశారు.ఇదంతా ముఖమంత్రి చంద్రబాబునాయుడు ఊర్లో ఉండగానే జరిగింది. ఎన్టీయార్ ముఖానికి టిడిపి జండా చుట్టిముఖం కనబడకుండా చేశారు. నడుంకు పాత చీర చుట్టారు. కింద లుంగీ కట్టారు. చేతులకు కూడా టిడిపి జండా చుట్టేశారు. ఛాతీ మీద మరొక రంగు చీర కప్పారు.

ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేసింది తెలుగుదేశం ప్రముఖ నేతలే అయినా, ముఠాతగాదాల వల్ల దీనిని ఆవిష్కరించకుండా గాలికొదిలేశారు. మూడేళ్లుగా అలా ముసుగులో పడిఉండింది.మహానాడు సందర్భంగా పార్టీ నేత చంద్రబాబు నాయుడు ఆవిష్కరిస్తారనుకున్నారు. అలా జరగలేదు. చివరకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ముసుగు తీసేశారు. ప్రజలు సంతోషించారు.అయితే, తెల్లవారేసరికి ఈ అపచారం జరిగింది.

 

click me!