కాన్పూర్‌లో కొత్తగా మరో 25 జికా వైరస్ కేసులు.. అధికారులు అప్రమత్తం.. రెండో రౌండ్ స్క్రీనింగ్ ప్రారంభం

By telugu teamFirst Published Nov 4, 2021, 4:03 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ జికా వైరస్ కలకలం రేపుతున్నది. కరోనా మహమ్మారి నుంచి ఇంకా కోలుకోనేలేదు. మరోవైపు జికా వైరస్ ప్రతాపం చూపిస్తున్నది. కేవలం కాన్పూర్‌లోనే కొత్తగా 25 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 36కు చేరింది.
 

లక్నో: Uttar Pradeshలో Zika Virus కలకలం కొనసాగుతున్నది. కొత్తగా మరో 25 జికా వైరస్ Caseలు నమోదయ్యాయి. ఈ కేసులను అధికారులు ధ్రువీకరించారు. తాజా ధ్రువీకరణతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 36కు చేరాయి. జికా వైరస్ కట్టడిపై అధికారులు అప్రమత్తమయ్యారు. చకేరి కంటోన్‌మెంట్ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నది. వైరస్ సోకినవారి ఇళ్లను జిల్లా మెజిస్ట్రేట్ విశాఖ్ జీ అయ్యర్ సందర్శిస్తున్నారు.

జికా వైరస్ సోకిన 25 మందిని అధికారులు ఐసొలేషన్‌లోకి పంపారు. ఇందులో వైమానిక దళ సిబ్బంది ఒకరూ ఉన్నారు. వైరస్ కట్టడి కోసం శానిటైజేషన్ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కనీసం 150 మంది మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు శానిటైజేషన్ ఆపరేషన్స్ చేపడుతున్నారు. లాల్ కుర్తి, కకోరీ, లాల్ బంగ్లా, ఖాజీ ఖేదా, ఓం పుర్వా, హర్జిందర్ నగర్ ఏరియాలపై ప్రధానంగా దృష్టి సారించారు.

ఇప్పటి వరకు కాన్పూర్ జిల్లాలో 45 వేల మందిని స్క్రీనింగ్ చేసినట్టు జిల్లా మెజిస్ట్రేట్ విశాఖ్ జీ అయ్యర్ తెలిపారు. కాన్పూర్‌లో జికా పరిస్థితులను పై స్థాయి అధికారులకు చేరవేశారు. దీనిపై గురువారం ముఖ్య మంత్రి కార్యాలయంలో ఓ సమావేశాన్ని నిర్వహించి చర్చించారు. ఇందులో ఆరోగ్య అధికారులూ పాల్గొన్నారు.

Also Read: జికా వైరస్ కలకలం.. ఉత్తరప్రదేశ్ తొలి కేసు నమోదు.. అప్రమత్తమైన అధికారులు

Kanpurలో తొలి జికా వైరస్ అక్టోబర్ 23న రిపోర్ట్ అయింది. తర్వాతి పది రోజుల్లోనే 11 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

అయితే, ఇప్పటి వరకు ఈ వైరస్ సోర్స్ ఆచూకీ లభించలేదు. వైరస్ ఎక్కడ మొదలైందనే విషయంపై ఆందోళన ఉన్నది. ఎక్కడి నుంచి వైరస్ వ్యాపించిందనే విషయాన్ని కనుగొనడానికి కంటోన్‌మెంట్ ఏరియా ప్రజలను పరీక్షిస్తామని జిల్లా మెజిస్ట్రేట్ వివరించారు. 

ఇందుకోసం తొలి రౌండ్‌లో 45వేల ప్రజలను స్క్రీనింగ్ చేశారు. కానీ, జికా వైరస్ సోర్స్‌ను కనిపెట్టలేకపోయారు. తాజాగా, ఈ రోజు రెండో దఫా Screening Testలను ప్రారంభించారు.

ఉత్తర ప్రదేశ్‌లో తొలి కేసు కాన్పూర్‌లోనే రిపోర్ట్ అయింది. కాన్పూర్‌లోని పొఖార్‌పురాలో నివసిస్తున్న భారత వైమానిక దళా అధికారికి ఈ వైరస్ సోకింది.

Also Read: కేరళను వణికిస్తున్న జికా వైరస్.. తాజాగా మరో ఐదుగురకి పాజిటివ్...

తొలుత జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ఆయన శాంపిల్స్‌ను టెస్టింగ్ కోసం ఆరోగ్య శాఖపూణెకు పంపించింది. ఈ టెస్టులో జికా వైరస్ పాజిటివ్‌గా వచ్చింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆయన నివసిస్తున్న ప్రాంతాన్ని శానిటైజ్ చేశారు. 200 మంది ఆయన క్లోజ్ కాంటాక్టులను గుర్తించి ఐసొలేట్ చేసినట్టు కాన్పూర్ చీఫ్ మెడికల్ అధికారి నేపాల్ సింగ్ తెలిపారు.

జికా వైరస్‌ ఉత్తరప్రదేశ్ కంటే ముందు కేరళ, మహారాష్ట్రలో నమోదైంది.

click me!