బీహార్‌లో విషాదం: కల్తీ మద్యానికి తొమ్మది మంది మృతి

By narsimha lodeFirst Published Nov 4, 2021, 3:29 PM IST
Highlights


కల్తీ మద్యం తాగి బీహార్ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్ జిల్లలో 9 మంది మరణించారు. మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.. 


పాట్నా: బీహార్ రాష్ట్రంలోని Gopalganj జిల్లాలో కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మరణించారు. Spurious Liquor సేవించినవారంతా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. కొందరిని కుటుంబసభ్యులు వారిని ఆసుపత్రికి తరలించారు. కొందరు ఇంట్లోనే మరనించారు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ నవల్ కిషోర్ చౌదరి తెలిపారు.

also read:తెలంగాణలో మద్యం అమ్మకాల్లో అక్టోబర్ నెల ఆల్‌లైం రికార్డు.. ఒక్క నెలలోనే అన్ని కోట్లు తాగేశారా..

గోపాల్ గంజ్ జిల్లాలోని కుషార్ గ్రామంలో పలువురు కల్తీ మద్యం తాగారు. ఈ మద్యం తాగిన 9 మంది మరణించారు. మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం నుండి ఇప్పటివరకు ఈ జిల్లాలో 9 మంది మరణించారని జిల్లా మేజిస్ట్రేట్ నవల్ కిషోర్ చౌదరి తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఈ మరణాలకు గల కారణాలు తెలుస్తాయని జిల్లా మేజిస్ట్రేట్ చెప్పారు.

మృతుల ఇళ్ల నుండి మద్యం నమూనాలను పోలీసులు సేకరించారు. ఈ నమూనాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. గోపాల్‌గంజ్ ఎస్‌డిపీఓ సంజీవ్ కుమార్, గోపాల్ గంజ్ ఎక్సైజ్ సూపరింటెండ్ రాకేష్ కుమార్ లు గ్రామంలో సోదాలు నిర్వహించారు. కల్తీ మద్యం కేసులో చతురామ్ పరారీలో ఉన్నాడు. అతని భాగస్వామి మహేష్ రామ్ కల్తీ మద్యం తాగి మరణించారు. నకిలీ మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకొన్నట్టుగా సంజీవ్ కుమార్ చెప్పారు.తన కొడుకు మంగళవారం నాడు సాయంత్రం మద్యం సేవించి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టుగా సంతోష్ షా తల్లి ఉమ్రావతిదేవి మీడియాకు చెప్పారు.

మంగళవారం నుండి రాష్ట్రంలోని  రెండు జిల్లాల్లో అక్రమ మద్యానికి సంబంధించిన మరణాలు చోటు చేసుకొంటున్నాయి. పశ్చిమ చంపరన్ జిల్లాలో ఆరు, గోపాల్‌గంజ్ జిల్లాలో 9 మంది మరణించారు. దీంతో మొత్తం రాష్ట్రంలో నకిలీ మద్యంతో మరణించిన వారి కేసులు 15కి చేరుకొన్నాయి.

పశ్చిమ చంపరన్ జిల్లాకు చెందిన ఆరుగరు మరణించిన ఘటనపై కూడ దక్షిణ తెల్హుా పంచాయితీ పోలీస్ సూపరింటెండ్ ఉపేంద్రనాథ్ వర్మ స్పందించారు. ఈ ఆరుగురు విషపూరిత పదార్ధాల కారణంగా మరణించినట్టుగా చెప్పారు. అయితే పోస్టుమార్టం నివేదికలో వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన చెప్పారు. మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పశ్చిమ చంపరన్ జిల్లాలో మరణించిన వారిని బచ్చా యాదవ్, మహరాజ్ యాదవ్, మనుమత్ రాయ్, ముఖేష్ పాశ్వాన్, రామ్ ప్రకాష్ రామ్, జవహీర్ సహానీగా గుర్తించారు. మృతులంతా నౌటన్ బ్లాక్ లో నివాసం ఉంటారని పోలీసులు తెలిపారు.

గత మాసంలో ముజఫర్‌‌పూర్ లో ఇదే తరహ ఘటన చోటు చేసుకొంది.ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు.బీహార్ లోని నితీష్ కుమార్ ప్రభుత్వం 2016 ఏప్రిల్ 5 మద్యం తయారీ, వ్యాపారం , నిల్వలు, రవాణ, వినియోగం, అమ్మకంపై నిషేధం విధించింది.సమాజం కోసమే మద్యాన్ని నిషేధం విధించినట్టుగా నితీష్ కుమార్ సర్కార్ ప్రకటించింది.

.


 

click me!