మేకప్ ఎంతపని చేసింది... వధువును చూసి కంగుతిన్న వరుడు... పెళ్ళి క్యాన్సిల్

Published : Mar 04, 2023, 09:11 AM IST
 మేకప్ ఎంతపని చేసింది... వధువును చూసి కంగుతిన్న వరుడు... పెళ్ళి క్యాన్సిల్

సారాంశం

పెళ్లిలో అందంగా కనిపించాలన్న ఆమె ప్రయత్నం ప్రాణాలమీదకు తెచ్చింది. ఓ బ్యూటీ పార్లర్ సిబ్బంది నిర్వాకంతో యువతి పెళ్లి ఆగిపోవడమే ఆమె హాస్పిటల్లో ఐసియూలో చేరాల్సి వచ్చింది. 

బెంగళూరు : శుభకార్యం ఏదయినా అమ్మలక్కలు అందగా ముస్తాబయివుతుంటారు. ఇక పెళ్లి తనదే అయితే ఆ అమ్మాయి అందరికంటే అందంగా వుండాలని భావిస్తుంటుంది. ఇందుకోసం ఎప్పుడూ వెళ్లని అమ్మాయిలు కూడా బ్యాటీ పార్లర్లకు వెళుతుంటారు. అయితే ఓ బ్యూటీ పార్లర్ సిబ్బంది నిర్వాకంతో అందంగా మారాల్సింది పోయింది అందవికారంగా తయారయ్యిందో యువతి. దీంతో మరికొద్దిరోజుల్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.  

వివరాల్లోకి వెళితే... హసన్ జిల్లాకు చెందిన ఓ యువతి కొద్దిరోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సి వుంది. కొద్దిరోజుల క్రితమే ఘనంగా నిశ్చితార్థం చేసి పెళ్లికి ముహూర్తం కూడా ఖరారుచేసారు. పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఈ సమయంలో పెళ్లిలో అందంగా కనపించేందుకు యువతి ఓ బ్యూటీ పార్లర్ ను ఆశ్రయించింది. ఇదే ఆమె పాలిట శాపంగా మారి పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. 

మేకప్ లో భాగంగా యువతి ముఖానికి ఆవిరి పడుతుండగా బ్యూటీ పార్లర్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆవిరి ఎక్కువై ఆ వేడికి యువతి ముఖమంతా వాచిపోయి అందవికారంగా తయారయ్యింది. ముఖమంతా నల్లగా మారి, కళ్లు, బుగ్గలు వాచిపోయి రూపం మొత్తం మారిపోయింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ముఖం ఇదివరకు వున్నట్లు మారడానికి మరికొన్ని సమయం పట్టే అవకాశాలున్నాయని డాక్టర్లు తెలిపారు. 

Read More  నల్లగా ఉందని భార్యను హతమార్చిన భర్త.. కర్నాటకలో ఘటన

అయితే ఇలా అందవికారంగా తయారయిన యువతిని చూసి పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు కంగుతున్నాడు. ఆ యువతిని పెళ్ళాడబోనని... పెళ్లి నిలిపివేస్తున్నట్లు కుటుంబసభ్యులకు తెలిపాడు. ఇప్పటికే కూతురికి ఇలా అయ్యిందని బాధపడుతున్న తల్లిదండ్రులకు వరుడి నిర్ణయం మరింత షాక్ కు గురిచేసింది.ఎంత సర్దిచెప్పినా యువకుడు మాత్రం పెళ్లికి ఒప్పుకోకపోవడంతో యువతి తల్లిదండ్రులు, బంధువులకు ఏం చేయాలో అర్థంకావడం లేదు. 

తమ ఆడబిడ్డ జీవితంతో ఆడుకున్న బ్యూటీ పార్లర్ పై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బ్యూటీ పార్లర్ యజమాని, సిబ్బందిని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు సాగుతోందని... తప్పెవరిదో తెలుసుని చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

ఎంతో ఆనందోత్సాహాలతో సందడిగా వుండాల్సిన ఇళ్లు ఓ బ్యూటీ పార్లర్ సిబ్బంది నిర్వాకంతో బోసిపోతోంది. ఈ ఘటన అందంగా కనిపించేందుకు ప్రతిసారీ బ్యూటీపార్లర్లను ఆశ్రయించే వారిని ఆలోచింపజేస్తోంది.మేకప్ పేరిట అడ్డమైన కెమికల్స్ తో కూడిన రంగులు ముఖానికి అద్దుకోవడం మంచిది కాదని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అయినప్పటికి మహిళలు మారకపోవడంతో వీధివీధికి బ్యూటీపార్లర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇలా వెలిసిన బ్యూటీ పార్లర్ వల్లే యువతి పెళ్లి ఆగిపోవడమే కాదు హాస్పిటల్ పాలయ్యింది. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..