మీరు మంత్రి.. వాక్ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేశారు.. ఉదయనిధి ‘సనాతన’ వ్యాఖ్యలపై సుప్రీం ఫైర్..

By Sairam IndurFirst Published Mar 4, 2024, 3:02 PM IST
Highlights

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను సుప్రీంకోర్టు మందలించింది. మంత్రి స్థాయిలో ఉండి వివాదాస్పద ప్రకటనలు చేయడం సరికాదని సూచించింది. వాక్ స్వాతంత్య్రాన్ని మీరు దుర్వినియోగం చేశారని పేర్కొంది. 

తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను సోమవారం సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. సనాతన ధర్మంపై స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మీరు సామాన్యమైన వ్యక్తి కారు. మీరు ఓ మంత్రి. అలా మాట్లాడితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో మీరే తెలుసుకోవాలి’’ అని సుప్రీంకోర్టు ఉదయనిధిపై మండిపడింది.

అయ్యో పాపం.. బిందెలో తలపెట్టి ఇరుక్కుపోయిన చిరుత.. వీడియో వైరల్

‘‘మీరు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ)ని ఉల్లంఘించారు. మీ మాటల పర్యవసానాల గురించి మీకు తెలియదా..? మీరు సామాన్యులు కాదు.. మీరు మంత్రి.. వాక్ స్వాతంత్య్రాన్ని మీరు దుర్వినియోగం చేశారు.’’ అని కోర్టు పేర్కొంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. 

అయితే వాటినన్నింటినీ ఒకే దగ్గర విచారించాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 15న జరగనుంది.

పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అనేక నిధులిచ్చింది - ప్రధాని నరేంద్ర మోడీ

కాగా.. సెప్టెంబర్ 2, 2023న 'సనాతన్ నిర్మూలన సదస్సు'లో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అందులో సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. ఈ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని, నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. “కొన్ని విషయాలను వ్యతిరేకించలేము, వాటిని రద్దు చేయాలి. డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనాను మనం వ్యతిరేకించలేం. దానిని మనం నిర్మూలించాలి. అదేవిధంగా మనం సనాతనాన్ని కూడా నాశనం చేయాలి.’’ అని ఆయన తెలిపారు.

నరేంద్ర మోడీ హిందువు కాదు - లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చినందుకు ఉదయనిధి స్టాలిన్‌పై చాలా రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయని మీకు తెలియజేద్దాం. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ ఒకచోట చేర్చాలని స్టాలిన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 15న జరగనుంది.

click me!