Lakhimpur Kheri: రాజకీయ నేతలంటే ఫార్చూనర్ కారుతో తొక్కేయడం కాదు: యూపీ బీజేపీ చీఫ్

Published : Oct 11, 2021, 01:16 PM ISTUpdated : Oct 11, 2021, 01:18 PM IST
Lakhimpur Kheri: రాజకీయ నేతలంటే ఫార్చూనర్ కారుతో తొక్కేయడం కాదు: యూపీ బీజేపీ చీఫ్

సారాంశం

లఖింపూర్ ఖేరి ఘటనపై ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ తొలిసారి స్పందించారు. రాజకీయ నేతలంటే ఫార్చూనర్ కారుతో తొక్కేయడం కాదని పరోక్షంగా ఘటనను ప్రస్తావించారు. రాజకీయాలు పార్ట్ టైం కాదని, పేర్కొంటూ తమ పార్టీ పేదలకు సేవ చేస్తుందని అన్నారు.

లక్నో: దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరి ఘటనపై ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ స్పందించారు. తొలిసారిగా ఆ ఘటనపై స్పందిస్తూ పరోక్షంగా ఆ మంత్రి కొడుకును ప్రస్తావించారు. రాజకీయ నేతలంటే fortuner కారుతో తొక్కేయనవసరం లేదని నర్మగర్భంగా మాట్లాడారు. Lakhimpur Kheriలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిశ్ మిశ్రా వెళ్తున్న కారు రైతుల ఆందోళనకారులపై దూసుకెళ్లినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ మైనారిటీ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ సన్నాహక సమావేశం లక్నోలో జరిగింది. ఇందులో యూపీ bjp chief స్వతంత్ర దేవ్ మాట్లాడారు.

Also Read: Lakhimpur Kheri: 24 గంటలపాటు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన ప్రభుత్వం.. వివరాలివే

‘ఎన్నికలు వ్యక్తి ప్రవర్తనపై ఆధారపడి గెలవాలి. రాజకీయాలు సమాజానికి, దేశానికి సేవ చేయడానికే. ఇందులో కులం, మతం ప్రమేయముండదు. ఒక రాజకీయ నేతవై ఉన్నంత మాత్రానా ప్రజలను దోచుకోవాల్సిన పనిలేదు. ఫార్చూనర్ కారుతో తొక్కేయడం కాదు.. రాజకీయ నేతలంటే. మనం పేదలకు సేవ చేసే పార్టీలో ఉన్నాం. మరొక విషయం.. రాజకీయాలు పార్ట్ టైమ్ ఉద్యోగాల వంటివి కావు’ అని స్వతంత్ర దేవ్ సింగ్ తెలిపారు.

ఇదే ప్రసంగంలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై ప్రశంసలు కురిపించారు. వారు పేదరికం నుంచి వచ్చి దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవులను అధిరోహించారు. అలాగే, సోనియా గాంధీపై విమర్శలు చేశారు. సోనియా గాంధీ ఒక దశాబ్దంపాటు దేశాన్ని దోచుకున్నారని ఆరోపించారు. వచ్చే ఏడాదిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్