Mumbai Drugs Case : క్రూయిజ్ లో రేవ్ పార్టీకి ‘శానిటరీ న్యాప్ కీన్స్’లో డ్రగ్స్ సరఫరా...

By AN TeluguFirst Published Oct 11, 2021, 10:56 AM IST
Highlights

డ్రగ్స్ దందాను పోలీసులు ఎన్నిరకాలుగా అడ్డుకున్నా.. ముఠా సభ్యులు పలువిధాలుగా సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా mumbai cruise shipలో జరిగిన rave partyలో ఓ మహిళా నిందితురాలు sanitary napkins డ్రగ్స్ తీసుకెళ్లినట్లు తేలింది. 

ముంబయి : డ్రగ్స్ దందాను పోలీసులు ఎన్నిరకాలుగా అడ్డుకున్నా.. ముఠా సభ్యులు పలువిధాలుగా సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా mumbai cruise shipలో జరిగిన rave partyలో ఓ మహిళా నిందితురాలు sanitary napkins డ్రగ్స్ తీసుకెళ్లినట్లు తేలింది. 

ఆమెనుంచి ఐదు గ్రాముల డ్రగ్స్ ను నార్కొటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మొత్తం 19మందిని అరెస్ట్ చేసినట్లు ఎన్ సీబీ అధికారులు తెలిపారు. ఈ నెల మూడో తేదీన ముంబయి క్రూజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీ మీద ఎన్ సీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. 

ఈ కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కుమారుడు aryan khan ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చేందుకు ఆర్యన్ ఖాన్ ప్రయత్నించినప్పటికీ న్యాయస్థానం అందుకు నిరాకరించింది. దీంతో ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఏడుగురు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.

ఇక ముంబయి డ్రగ్స్ కేసు వ్యవహారంలో దూకుడుగా వెడుతున్న పోలీసులు.. ఈ కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న వారిని విచారిస్తున్నారు. ఇందులో బాగంగా ఆర్యన్ ఖాన్ కారు డ్రైవర్ ను ఇప్పటికే ప్రశ్నించారు. కేసు విచారణలో భాగంగా అక్టోబర్ 11న తమ ముందు హాజరు కావాలంటూ తాజాగా ప్రొడ్యూసర్ ఇంతియాజ్ ఖత్రీకి ఎన్ సీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 

కాగా, మహారాష్ట్ర రాజధాని ముంబయి నుంచి గోవాకు వెళ్తున్న ఓ క్రూయిజ్ షిప్‌లో NCB అధికారులు సోదాలు, అందులో బాలీవుడ్ స్టార్ shahrukh khan తనయుడు aryan khanపట్టుబడటంపై అధికార పార్టీ ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ గత గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తనిఖీలు అన్నీ ఫేక్ అని అన్నారు. నెక్స్ట్ టార్గెట్ షారూఖ్ ఖానే అని ప్రకటించారు. ఎన్‌సీబీ తనిఖీల్లో బయటి వారి ప్రమేయమూ ఉన్నదని అన్నారు.

ముంబై డ్రగ్స్ కేసు: ఆర్యన్‌ఖాన్‌కు కోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ... 14 రోజుల రిమాండ్

ఈ నెల 2న జరిగిన ఎన్‌సీబీ తనిఖీలు అన్నీ నకిలీవని ncp నేత నవాబ్ మాలిక్ అన్నారు. ఆ దాడిలో అసలు మాదక ద్రవ్యాలే లభించలేవని తెలిపారు. ఆర్యన్ ఖాన్ అరెస్టు ఒక ఫోర్జరీ అని ఆరోపించారు. గత నెల రోజులుగా నెక్స్ట్ టార్గెట్ షారూఖ్ ఖాన్ అని క్రైం రిపోర్టర్లకు సమాచారాన్ని పంచుకుంటూ వస్తున్నారని తెలిపారు. 

అంతేకాదు, ఎన్సీబీ తనిఖీల్లో ఓ బీజేపీ నేత ఉన్నారని ఆరోపించారు. మరో ప్రైవేటు డిటెక్టివ్ కూడా ఉన్నారని వివరించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోనూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన పేర్కొన్న వీడియోలో బీజేపీ నేత భానుశాలి, ప్రైవేటు డిటెక్టివ్ గోసావి ఉన్నారు.

click me!