కథ అడ్డం తిరిగింది.. డిప్యూటీ కలెక్టర్ ఇంట్లోకి దోపిడీకి వెళ్లి.. షాకింగ్ లేఖ రాసి వచ్చిన దొంగ

By telugu teamFirst Published Oct 11, 2021, 12:35 PM IST
Highlights

ఓ దొంగ ఏకంగా డిప్యూటీ కలెక్టర్ ఇంటిలోనే దోపిడీకి వెళ్లాడు. ఇంటిలోకి దూరడమే కాదు.. అక్కడ నగలు, నగదు ఆశించిన మేరకు లభించలేదు. దీంతో నిరాశగా ఓ నోట్ రాసి పెట్టి బయటపడ్డాడు. డిప్యూటీ కలెక్టర్ ఇంటిలో చోరీనే కాదు, ఆ నోట్ పోలీసులకు సవాల్ విసురుతున్నది.
 

భోపాల్: చుట్టూ అధికారుల భవనాలే.. ఓ చట్ట సభ్యుడు, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ నివాసాలు, ఎస్పీ నివాసానికి సమీపంలోనే మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో deputy collector త్రిలోచన్ గౌర్ అధికారిక నివాసమున్నది. ఈ డిప్యూటీ కలెక్టర్ త్రిలోచన్ గౌర్ ఇంటిలో దోపిడీకి ఓ thief వెళ్లాడు. ఇల్లంతా వెతికాడు. అసలే అది డిప్యూటీ కలెక్టర్ ఇల్లు.. అందులోనూ అధికారిక నివాసం.. ఎంతో సొమ్ము ఉంటుందని ఆ దొంగ భావించాడు. డిప్యూటీ కలెక్టర్ త్రిలోచన్ గౌర్ ఆ ఇంటికి 15 నుంచి 20 రోజుల వరకు వెళ్లలేదు. ఇదే అదనుగా చూసి ఆ దొంగ robberyకి ప్రయత్నించాడు. కానీ, ఎంత వెతికినా ఆ దొంగ ఆశించిన మేర డబ్బు, బంగారం, సొమ్ము కనిపించలేదు. తన ఆశలన్నీ ఆవిరయ్యాయి. మళ్లీ గుట్టుచప్పుడు వెనుదిరిగాడు. కానీ, అంతకు ముందే ఆయన నివాసంలో ఓ షాకింగ్ note రాసి పెట్టి వచ్చాడు. ఇప్పుడు ఆ నోట్ వైరల్ అవుతున్నది.

In a strange incident of theft in Dewas, burglars not only broke into the house of a deputy collector but also left a note for him. "Jab paise nahi they toh lock nahi karna tha na collector! pic.twitter.com/mafaLj4gPC

— Anurag Dwary (@Anurag_Dwary)

‘అసలు ఇంటిలో పైసలే లేనప్పుడు మీరు తాళం వేసి వెళ్లాల్సింది కాదు.. కలెక్టర్’ అని ఆ దొంగ ఓ లెటర్ రాసి వెళ్లాడు. డిప్యూటీ కలెక్టర్ నివాసంలోకి ఓ దొంగ చొరబడటమే సవాల్‌గా మారడమే కాదు.. ఈ లేఖ మరింత సంచలనానికి తెరతీసింది. ఈ దొంగతనం ఇప్పుడు జిల్లా పోలీసులకు సవాల్ విసురుతున్నది.

Also Read: క్రైం కపుల్స్.. వినూత్న రీతిలో చోరీలు చేసిన ప్రేమికుల జంట.. ఇల్లు అద్దెకిస్తారా అంటూ స్కెచ్

డిప్యూటీ కలెక్టర్ త్రిలోచన్ గౌర్ తిరిగి తన అధికారిక నివాసానికి వెళ్లగానే ఇంటిలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించాడు. అంతేకాదు, నగదు, కొన్ని వెండి ఆభరణాలు మాయమైనట్టు గుర్తించాడు. దేవాస్ జిల్లా ఖాటేగావ్ తెహసిల్‌ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ త్రిలోచన్ గౌర్ ఇంటిలో దోపిడీ జరిగిందని, అందులో రూ. 30వేల నగదు, కొన్ని నగలు చోరీ అయినట్టు ఇన్‌స్పెక్టర్ ఉమ్రావ్ సింగ్ తెలిపారు. policeలు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టినట్టు వివరించారు.

click me!