కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి సీఎం యోగీ ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియా సంస్థ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. భారత దేశం గురించి రాహుల్ విదేశాల్లో చేసిన వ్యాఖ్యల ఉద్దేశం ప్రజలకు అర్థమైందని ఆయన దుయ్యబట్టారు..

రాహుల్ గాంధీ చేసే పనులు బీజేపీకి మేలు చేస్తాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. భారత్ వెలుపల రాహుల్ మన దేశం గురించి చేసే వ్యాఖ్యల వెనకాల ఉన్న అసలు ఉద్దేశం ప్రజలకు అర్థమైందని యోగీ ఖండించారు. రాహుల్ జోడో యాత్ర చేసింది విభజన రాజకీయాల్లో భాగంగానే అనే యోగీ ఆరోపించారు. రాహుల్ అసలు ఉద్దేశాన్ని దేశ ప్రజలకు ఇప్పటికే అర్థమైందన్నారు.
రాహుల్ లాంటి వ్యక్తుల వల్ల తమ పార్టీకి వచ్చే నష్టం లేదని, పైగా మంచి జరుగుతుందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయ ప్రయోజనాల కోసం సున్నితమైన అంశాలను కాంగ్రెస్ పొడిగించిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ పలు కీలక ప్రశ్నలను యోగీ సంధించారు. ట్రిపుల్ తలాక్‌ను కాంగ్రెస్ ఎందుకు రద్దు చేయలేదని, కుంభమేళాను ఎందుకు ప్రచారం చేయలేదని, దేశానికి ఉన్నతస్థాయి మౌలిక సదుపాయాలను ఎందుకు కల్పించలేదని యోగీ ప్రశ్నించారు.
గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో విదేశీ జోక్యం గురించి కూడా యోగీ ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిందని, ఎన్నికలను ప్రభావితం చేసేందుకు జార్జి సోరస్ డబ్బును ఉపయోగించిందని ఆరోపించారు. విదేశీ డబ్బును ఉపయోగించడం దేశ ద్రోహం కిందికి రాదా అని యోగీ ప్రశ్నించారు. మొత్తం మీద ఈ ఇంటర్వ్యూలో యోగీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.