Covid-19: చైనాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. అలాగే, అమెరికా, సింగపూర్ దేశాల్లో కూడా ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఆయా దేశాల్లో కరోనా వ్యాప్తికి కారణమైన ఒమిక్రాన్ సహా ఇతర వేరియంట్లు భారత్ లోనూ వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించడంతో పాటు ప్రజలు కోవిడ్-19 మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.
coronavirus outbreak: పలు దేశాల్లో ప్రస్తుతం కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. చైనాలో అయితే, ఏకంగా లక్షల్లో కోవిడ్-19 కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. అయితే, ప్రస్తుతం చైనాలో కరోనావైరస్ ఉద్ధృతికి కారణమైన కోవిడ్-19 ఒమిక్రనా సబ్ వేరియంట్లు భారత్ లోనూ వెలుగుచూడటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎక్స్ బీబీ రకానికి చెందిన వేరియంట్లు కోవిడ్ అధిక వ్యాప్తికి కారణంగా ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
అమెరికా, సింగపూర్ లలో..
undefined
ప్రస్తుతం అమెరికా, సింగపూర్ లలో కూడా కోవిడ్-19 వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) విడుదల చేసిన డేటా ప్రకారం, అమెరికాలో ఇటీవలి కోవిడ్ -19 కేసులలో 40 శాతానికి పైగా ఒమిక్రాన్ బీఏ.2 ఉప-వేరియంట్ అయిన ఎక్స్ బీబీ 1.5 వేరియంట్ కారణంగా ఉంది. మిన్నెసోటా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ మైఖేల్ ఓస్టర్హోమ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వేరియంట్లలో ముఖ్యమైంది ఎక్స్ బీబీ అని పేర్కొన్నారు. అమెరికాలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్న 10 రాష్ట్రాల్లో ఏడు రకాలు ఎక్స్ బీబీ వేరియంట్ కు సంబంధించినవే కావడం గమనార్హం. డిసెంబర్ 31 తో ముగిసిన వారంలో, వేరియంట్ బీఏ.2 అమెరికాలో మొత్తం కేసులలో 44.1 శాతం ఉంది. ఈ వేరియంట్లలో XBB, XBB.1.5 లు ఉన్నాయి.
భారత్ లోనూ వెలుగులోకి..
చైనా, సింగపూర్, అమెరికాలో కరోనా అధిక వ్యాప్తికి కారణమైన వేరియంట్లను భారత్ లోనూ గుర్తించారు. ప్రస్తుతం కోవిడ్-19 ఉద్ధృతికి కారణమైన ఈ ఎక్స్ బీబీ.1.5 వేరియంట్ ను భారతదేశంలో మొదట ఆగస్టులో గుర్తించారు. ఇది ఇప్పుడు xbb.1, xbb.1.5 ఉప-వేరియంట్లుగా అభివృద్ధి చెందింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వైరాలజిస్ట్ ఆండ్రూ పెకోస్ మాట్లాడుతూ.. ఎక్స్ బీబీ.1.5 దాని కుటుంబానికి చెందిన జాతుల నుంచి భిన్నంగా ఉందనీ, ఇది అదనపు ఉత్పరివర్తనం చేందే విధమైనదని పేర్కొన్నారు. కరోనా ఓమిక్రాన్ చెందిన ఎక్స్ బీబీ.1.5 సబ్ వేరియంట్ మొదటి కేసు భారతదేశంలో ఇటీవల గుర్తించారు. ఇన్సాకాగ్ డేటా ఆధారంగా, ఈ కేసు గుజరాత్ కనుగొనబడింది. మరిన్ని కేసులు సైతం ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇక మహారాష్ట్రలో అయితే, ఎక్స్ బీబీ కుటుంబానికి చెందిన వేరియంట్ల రకాల్లోని 275 కేసులను గుర్తించినట్టు అధికారిక డేటా పేర్కొంటోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.
XBB.1.5 ఎందుకు అధికంగా వ్యాపిస్తోంది..?
పీకింగ్ యూనివర్సిటీ సైంటిఫిక్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యున్లాంగ్ రిచర్డ్ కావో నే డేటా ప్రకారం, XBB.1.5 యాంటీబాడీలకు నిరోధకతను కలిగి ఉంటుంది. కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎక్స్ బీబీ వంటి ఉపవిభాగాల పెరుగుదల ప్రస్తుత కోవిడ్ వ్యాక్సిన్ల ప్రభావాన్ని తగ్గిస్తుందని హెచ్చరించారు. దీని ప్రభావం వల్ల ఇన్ఫెక్షన్ మళ్లీ వేగంగా పెరుగుతుంది. యాంటీబాడీలను టీకాలు వేయడానికి, తటస్తం చేయడానికి ఎక్స్ బీబీ సబ్వాలెంట్ల సామర్థ్యం చాలా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు తెలిపారు.