బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రత నమోదు..

Published : Jan 01, 2023, 02:58 PM IST
బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రత నమోదు..

సారాంశం

కొత్త సంవత్సరం మొదటి రోజున రెండు వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. వీటి వల్ల ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. మొదటి భూకంపం ఢిల్లీ, దాని పరిసరాల్లో రాష్ట్రాల్లో సంభవించగా.. రెండో భూకంపం బంగాళాఖాతంలో వచ్చింది. 

బంగాళాఖాతంలో భూకంపం ఆదివారం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. 36 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు చెలరేగాయి. నూతన సంవత్సరం మొదటి రోజున ఉదయం 10.57 గంటలకు ఇవి మొదలయ్యాయి. 

బౌద్ధ మత నిర్మూలనకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది: దలైలామా సంచలన ఆరోపణలు

కాగా.. కొత్త ఏడాది ప్రారంభమైన మొదటి రోజులోనే ఇది రెండో భూకంపం. అంతకు కొంత సమయం ముందు దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లోకూడా  భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

ఇదే భూకంపం ఢిల్లీకి సమీపంలో ఉన్న హర్యానాలో కూడా కనిపించింది. ఈ రాష్ట్రంలోని ఝజ్జర్‌లో దీని తీవ్రత 3.8గా నమోదు అయ్యింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అర్థరాత్రి 1:19 గంటల సమయంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల దిగువన నమోదయ్యానట్టు సమాచారం. దీని కారణంగా చాలా మంది ఈ భూకంపం ప్రభావాన్ని ఎదుర్కొన్నారు. రోహ్తక్-ఝజ్జర్ గుండా వెళుతున్న మహేంద్రగఢ్-డెహ్రాడూన్ ఫాల్ట్ లైన్ దగ్గర తరచుగా భూకంపాలు సంభవిస్తాయి.

ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం.. వారిద్దరినీ హత్య చేసిన భర్త.. ఢిల్లీలో అరెస్టు

కాగా.. అంతకుముందు డిసెంబర్ 5వ తేదీ ఉదయం బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. ఉదయం 8:32 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. కోల్‌కతాకు 409 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఈ భూకంపం వచ్చింది. దీని కేంద్రం భూమి లోపల 10 కి.మీ. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది.

New Year 2023: 3.50 లక్షల బిర్యానీ, 61,000 పిజ్జా ఆర్డ‌ర్ల‌తో కొత్త సంవ‌త్స‌రంలో దుమ్మురేపిన స్విగ్గీ

భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీనినే భూకంపం అని అంటారు.
 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !