Work From Home: ఒమిక్రాన్ దెబ్బ‌.. ఈ కంపెనీల్లో శాశ్వ‌తంగా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం !

By Mahesh Rajamoni  |  First Published Dec 29, 2021, 1:55 AM IST

Work From Home: క‌రోనా మ‌హ‌మ్మారి వెలుగుచూసిన త‌ర్వాత చాలా మంది ఇండ్ల‌కే ప‌రిమితం కావాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే త‌మ కార్య‌క‌లాపాలు కొన‌సాగించ‌డానికి చాలా కంపెనీలు ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం స‌దుపాయం క‌ల్పించాయి. ఒమిక్రాన్ నేప‌థ్యంలో 2022 లో కూడా ప‌లు కంపెనీలు శాశ్వ‌తంగా త‌మ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం సౌక‌ర్యాన్ని కల్పించడానికి నిర్ణయించాయి. 


Work From Home: కరోనా వైరస్ వెలుగుచూసిన త‌ర్వాత మాన‌వ స‌మాజంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కార‌ణంగా చాలా మంది ఇండ్ల‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే మొద‌ట్లో ప‌లు కంపెనీలు ఉద్యోగులు ఇంటి నుంచే ప‌నిచేసే సౌక‌ర్యాన్ని క‌ల్పించాయి. ఆ త‌ర్వాత చాలా సంస్థ‌లు అదే దారిలో ముందుకు సాగుతూ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం సౌక‌ర్యాన్ని క‌ల్పించాయి. అయితే, క‌రోనా ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్టడంతో కంపెనీలు 2022 జ‌న‌వ‌రి నుంచి కార్యాల‌యాలు తెరిచేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. ఒమిక్రాన్ తో మ‌ళ్లీ క‌థ మొద‌టికొచ్చింది. వ‌చ్చే కొత్త సంవ‌త్స‌రంలోనూ (2022) ప‌లు కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు శాశ్వ‌తంగా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ను క‌ల్పించాయి. వాటిలో.. 

Also Read: Mukesh Ambani: వారసుల చేతుల్లోకి రిలయన్స్‌.. ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్య‌లు !

Latest Videos

undefined

స్లాక్‌ (Slack):
స్లాక్‌ అనేది ఒక సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫామ్‌. కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా ఇంటి నుంచే పని చేసేందుకు నిర్ణయించింది. మహమ్మారి సమయంలో కాలిఫోర్నియాకు చెందిన ఎంటర్‌ ప్రైజ్‌ తన ఉద్యోగులను శాశ్వతంగా ఇంటి నుంచే వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసేందుకు అంగీకరించింది.

ట్విట్టర్‌ (Twitter):
సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్టర్‌ కూడా కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోమ్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కార్యాలయంలో భౌతికంగా ఉండాల్సిన అవసరం ఉన్నవారు తప్ప మిగతా వారికి శాశ్వత వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసేందుకు అంగీకరిస్తోంది. ఉద్యోగులు తమకు వర్క్‌ ఫ్రం హోమ్‌ వద్దని భావించినప్పుడు కార్యాలయానికి వచ్చిన ఉద్యోగం చేసుకోవచ్చనే వెసులుబాటు కూడా ఇచ్చింది ట్విట్ట‌ర్‌. 

స్పాటిఫై (Spotify):
స్వీడన్‌కు చెందిన మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ స్పాటిఫై ఫిబ్రవరిలో తన ఉద్యోగులకు ఎక్కడి నుంచైనా పనులు చేసేలా అవకాశం ఇచ్చింది. అయితే ఉద్యోగులు కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత ఇంటి నుంచైనా, కార్యాలయం నుంచైనా ఉద్యోగం చేసేందుకు అవ‌కాశం క‌ల్పించింది. 

Also Read: Assembly Election 2022: ఒమిక్రాన్ సాకుతో ఎన్నిక‌ల వాయిదాకు బీజేపీ కుట్ర.. ఛ‌త్తీస్ గ‌ఢ్ సీఎం !

టాటా స్టీల్‌ (Tata Steel):
దేశీయ స్టీల్‌ తయారీ కంపెనీ టాటా స్టీల్‌ కూడా తన ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసేందుకు అంగీకరించింది. వర్క్‌ ఫ్రం హోమ్‌ పాలసీ ఎజైల్‌ వర్కింగ్‌ మోడల్‌ అని పిలువబడే ఉద్యోగులు సంవత్సరంలో 365 రోజుల పాటు వర్క్‌ ఫ్రం హోమ్‌ను ఎంచుకునే అవకాశం ఇచ్చింది. కాగా, టాటా స్టీల్‌ ఈ ఏడాది సెకండ్‌ వేవ్‌లో ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి అండగా నిలుస్తూ.. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రతి నెల వేతనంతో పాటు వారి పిల్లల చదువు, మెడికల్‌, రెసిడెన్షి సదుపాయాలను కూడా కంపెనీ క‌ల్పిస్తోంది. 

మెటా (Meta):
మెటా (ఫేస్‌బుక్‌) సంస్థ కరోనా మహమ్మారి ప్రారంభంలో ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ను ప్రకటించింది. ఇప్పుడు కంపెనీ ఆఫీస్‌ డిఫెరల్‌ ప్రోగ్రాంను రూపొందించింది. ఇది ఉద్యోగులకు కార్యాలయాలకు తిరిగి వచ్చేందుకు సౌలభ్యాన్ని కల్పించింది. అయితే కొంత మంది ఉద్యోగులు తిరిగి వచ్చేందుకు సిద్ధంగా లేరని గుర్తించిన సంస్థ.. ఉద్యోగులు ఎక్కడి నుంచైనా ప‌నిని చేసేందుకు అంగీకరించింది. డిసెంబర్‌లో సోషల్‌ మీడియా టెక్‌ కంపెనీ తన యూఎస్‌లో తన కార్యాలయాలను జనవరి 31, 2022 నుంచి పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించినప్పటికీ.. కొత్త వేరియంట్‌ వ్యాప్తి, కరోనా వ్యాప్తి కారణంగా పునరాలోచనలో పడింది.

Also Read: Assembly Election 2022:ఎన్నిక‌లే ల‌క్ష్యం.. ఈ నెల 30న ఉత్త‌రాఖండ్ లో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌

మైక్రోసాఫ్ట్‌ (Microsoft):
సాప్ట్ వేర్ దిగ్గ‌జం  మైక్రోసాఫ్ట్ క‌రోనా స‌మ‌యంలో  మొత్తం హైబ్రిడ్‌ వర్క్‌ మాన్యువల్‌ను తయారు చేసింది. ఉద్యో్గులు వారంలో 50 శాతం కంటే తక్కువ సమయం ఇంటి నుంచి పని చేయడానికి వీలు కల్పించింది. కొందరికి శాశ్వతంగా ఇంటి నుంచే పని చేసేలా అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించింది. 

షాపీఫై (Shopify):
 క్లౌడ్‌, మల్లీఛానల్‌, చిన్న వ్యాపార, మధ్య వ్యాపార బహుళ విక్రయ ఛానెల్‌లలో తమ స్టోర్‌లను సృష్టించడానికి, డిజైన్‌ చేయడంలో కార్య‌క‌లాపాలు నిర్వహిస్తున్న షాపీఫై కూడా  ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ను క‌ల్పించింది.  ఇప్పుడు కంపెనీ వర్క్‌ ఫ్రం హోమ్‌ను శాశ్వతంగా మార్చేందుకు నిర్ణయించింది.

Also Read: coronavirus: ఒమిక్రాన్‌ ఇమ్యూనిటీతో డెల్టాకు చెక్‌.. కొత్త అధ్య‌య‌నంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు !

click me!