Assembly Election 2022: ఒమిక్రాన్ సాకుతో ఎన్నిక‌ల వాయిదాకు బీజేపీ కుట్ర.. ఛ‌త్తీస్ గ‌ఢ్ సీఎం !

By Mahesh Rajamoni  |  First Published Dec 29, 2021, 12:29 AM IST

Assembly Election 2022: ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా పంజా విసురుతోంది. ఈ వేరియంట్ కేసులు భార‌త్ లోనూ క్ర‌మంగా పెరుగుతున్నాయి. అయితే, ఒమిక్రాన్ సాకుగా ఉప‌యోగించుకుని బీజేపీ.. అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డానికి కుట్ర చేస్తున్న‌ద‌ని ఛ‌త్తీస్ గ‌ఢ్ సీఎం భూపేష్ బఘేల్ ఆరోపించారు. 
 


Assembly Election 2022: క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా దేశాల్లో పంజా విసురుతోంది. ఇప్ప‌టికే ఈ ర‌కం కేసులు భార‌త్ లోనూ న‌మోద‌య్యాయి. ఒమిక్రాన్ కేసులు నిత్యం వెలుగుచూస్తుండ‌టంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఎందుకుంటే ఇదివ‌ర‌క‌టి క‌రోనా వైర‌స్ వేరియంట్ల కంటే ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. అలాగే, ఈ వేరియంట్ అత్యంత ప్ర‌మాక‌ర‌మైనది నిపుణులు అంచనా వేస్తున్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం వచ్చే ఏడాదిలో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను సాకుగా ఉప‌యోగించుకుని జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డానికి కేంద్రంలోని ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ కుట్ర చేస్తోంద‌ని ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి భూపేష్ బ‌ఘేల్ ఆరోపించారు. అలాగే, ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం ద్వారా పిలిచిన స‌మావేశానికి ఎన్నిక‌ల సంఘం అధికారులు హాజ‌రైన విష‌యాన్ని ప్ర‌స్తావించిన ఆయ‌న‌.. ఎన్నిక‌ల సంఘం విశ్వ‌స‌నీయ‌త‌పైనా సందేహాల‌ను లేవ‌నెత్తారు.

Also Read: Assembly Election 2022:ఎన్నిక‌లే ల‌క్ష్యం.. ఈ నెల 30న ఉత్త‌రాఖండ్ లో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌

Latest Videos

undefined

వ‌చ్చే ఏడాది (2022)లో ప‌లు రాష్ట్రాల్లో Assembly Elections జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుత ప‌రిస్థితులు క‌రోనా విజృంభ‌ణకు సంబంధించిన విష‌యాలు తెలుసుకోవ‌డానికి ఎన్నిక‌ల సంఘం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో స‌మావేశ‌మైంది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్‌తో సహా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో  ఎన్నిక‌ల సంఘం  సమావేశం నిర్వహించి, COVID-19 పరిస్థితిపై చర్చించిన ఒక రోజు తర్వాత ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి భూపేష్ బఘేల్ ఈ ఆరోప‌ణ‌లు చేశారు. దేశంలో ప్ర‌స్తుతం ఒమిక్రాన్ కేసులు కొద్దిసంఖ్య‌లోనే న‌మోద‌య్యాయి..వైర‌స్ పేరుతో బీజేపీ ఎన్నిక‌ల‌ను వాయిదా వేసేందుకు కుట్ర ప‌న్నుతోందా అని ఆయ‌న‌ అనుమానం వ్య‌క్తం చేశారు.  “ఈరోజు ఓమిక్రాన్ కేసులు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఎన్నికలను వాయిదా వేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందా? అనేక ఊహాగానాలు ఉన్నాయి.  ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం  పిలిచిన సమావేశానికి హాజరైనందున ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థగా విశ్వసనీయత అనుమానాస్పదంగా ఉంది”అని ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి భూపేష్ బ‌ఘేల్ అన్నారు. 

Also Read: coronavirus: ఒమిక్రాన్‌ ఇమ్యూనిటీతో డెల్టాకు చెక్‌.. కొత్త అధ్య‌య‌నంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు !

ఇదిలావుండ‌గా, దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుద‌ల‌పై కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌పైనా ఆంక్ష‌లు విధించాయి. ప‌లు రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూ సైతం కొన‌సాగుతోంది. క‌రోనా ప‌రీక్ష‌ల‌తో పాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఆధికార యంత్రాంగం వేగం పెంచింది. అయితే, వ‌చ్చే ఏడాది అంటే మ‌రో మూడు నెల‌ల్లో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి అనుగుణంగా ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ప్ర‌స్తుత క‌రోనా వైర‌స్ ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని అల‌హాబాద్ న్యాయ‌స్థానం సూచించింది. ఈ నేప‌థ్యంలోనే కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉన్న‌తాధికారుల‌తో ఎన్నిక‌ల సంఘం స‌మావేశ‌మైంది. దేశంలో పెరుగుతున్న క‌రోనా వైర‌స్ కేసులు, కోవిడ్‌-19 వ్యాక్సినేష‌న్ క‌వ‌రేజీకి సంబంధించిన విష‌యాలు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు వంటి అంశాల‌పై చ‌ర్చించింది.  క‌రోనా వైర‌స్ ప్ర‌భావం 2022లో  ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూప‌నుంద‌ని తెలుస్తోది. 

Also Read: Assembly Election 2022: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల వాయిదాకు అవ‌కాశం లేదు !

click me!