‘గే’ లను ఆర్మీలోకి అనుమతించం.. ఆర్మీ చీఫ్

By ramya neerukondaFirst Published Jan 10, 2019, 3:45 PM IST
Highlights

 భారత సైన్యంలోకి వ్యభిచారులను, స్వలింగ సంపర్కులను అనుమతించడం సాధ్యం కాదన్నారు. స్వలింగ సంపర్కం లాంటివి ఆర్మీలో కుదరవన్నారు.

స్వలింగ సంపర్కులపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్మీలోకి గే( స్వలింగ సంపర్కులు)లను అనుమతించలేమని ఆయన తెలిపారు. భారత సైనిక దళం సాంప్రదాయకమైందని.. అందులోకి స్వలింగ సంపర్కలను అనుమతించమని ఆయన అన్నారు. 

ఇటీవల సుప్రీం కోర్టు గే సెక్స్ కి అనుకూలంగా తీర్పు  ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ వద్ద ప్రస్తావించినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు. భారత సైన్యంలోకి వ్యభిచారులను, స్వలింగ సంపర్కులను అనుమతించడం సాధ్యం కాదన్నారు. స్వలింగ సంపర్కం లాంటివి ఆర్మీలో కుదరవన్నారు. అది సైన్యం చట్టాలకు అతీతం కాదని, అయితే.. రాజ్యాంగం సైన్యానికి కొంత స్వాతంత్య్రాన్ని ఇచ్చిందని చెప్పారు. 

click me!