సీన్ రివర్స్.. యువకుడికి కూల్ డ్రింక్ లో మత్తమందు కలిపిచ్చి.. నగ్న వీడియోలు తీసి.. మహిళ బ్లాక్ మెయిల్...

By SumaBala BukkaFirst Published Jan 21, 2022, 11:30 AM IST
Highlights

మరుసటిరోజు యువకుడు ఆమెకు ఫోన్ చేయగా సాయంత్రం ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోమని ఆమె చెప్పింది. సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ అతనికి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చింది. అది తాగిన ఆ యువకుడు స్పృహ కోల్పోయాడు.  ఆ తర్వాత khiladi మహిళా ఆ యువకుడితో చేసిన పాడుపనికి తెగబడింది. 

మధ్యప్రదేశ్ : Madhya Pradesh లో జంబలకిడి పంబలాంటి సీన్ జరిగింది. ఓ మహిళ.. యువకుడికి Cool drink లో మత్తుమందు కలిపి ఇచ్చి.. nude videoలు చిత్రీకరించి blackmail కు పాల్పడింది. ఆశ్చర్యంగా అనిపిస్తున్నా.. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. మహిళలూ దేంట్లోనూ తీసిపోలేదని ఈ ఘటనలు రుజువుచేస్తే తలదించుకునేలా చేస్తున్నాయి. అయితే ఈ ఘటనలో బ్లాక్ మెయిల్ విషయం బయటపడడంతో ఆ మహిళ పరారయ్యింది. 

ఒక బట్టల షాపు నడుపుకునే యువకుడి వద్ద ఓ మహిళ బట్టలు తీసుకుని డబ్బు తరువాత చెల్లిస్తానని చెప్పింది. తెలిసిన మహిళే కదా అని అతను సరే అన్నాడు. మరుసటిరోజు యువకుడు ఆమెకు ఫోన్ చేయగా సాయంత్రం ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోమని ఆమె చెప్పింది. సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ అతనికి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చింది. అది తాగిన ఆ యువకుడు స్పృహ కోల్పోయాడు.  ఆ తర్వాత khiladi మహిళా ఆ యువకుడితో చేసిన పాడుపనికి తెగబడింది. 

 వివరాల్లోకి వెళితే..  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాలో జానీ(రియల్ నేం కాదు) అనే ఓ యువకుడు బట్టల షాపు నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. నగరంలోని అంబేద్కర్ కాలనీలో నివసించే ప్రతిమ(రియల్ నేం కాదు) అనే ఓ మహిళ జానీ షాప్ లో కొన్ని బట్టలు కొని డబ్బులు తర్వాత చెల్లిస్తానని చెప్పింది. ఆమెతో అంతకుముందే పరిచయం ఉండడంతో జానీ కూడా సరేనని ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ప్రతిమకు డబ్బుల కోసం ఫోన్ చేయగా ఆమె సాయంత్రం ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళమని చెప్పింది.

ఆ రోజు సాయంత్రం ఆ మహిళ ఇంటికి జానీ వెళ్ళాడు.  ఆమె అతడిని ఇంట్లోకి రమ్మని పిలిచి కూల్ డ్రింక్ ఇచ్చింది. ఆ కూల్ డ్రింక్ తాగిన కాసేపటికి అతను స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత ఆమె జానీ బట్టలు విప్పేసి అతడిని బెడ్ రూంలోకి తీసుకెళ్లింది. అక్కడ ప్రతిమ కూడా బట్టలు విప్పేసి స్పృహలో లేని జానితో కలిసి నగ్నంగా వీడియో చిత్రీకరించింది. 

జానకి కాసేపటి తర్వాత స్పృహ వచ్చింది. కానీ అతని శరీరంపై బట్టలు లేవు.. పూర్తిగా నగ్న స్థితిలో ఉన్నాడు. ఏం జరిగిందోనని షాపులో ఉన్న జానీకి ప్రతియ మరో షాక్ ఇచ్చింది, అతని నగ్న వీడియోలు చూపించింది. 50 వేల రూపాయల డబ్బు అడిగింది. డబ్బులు ఇవ్వకపోతే వీడియో వైరల్ చేస్తానని blackmail చేసింది.. దీంతో జానీ ఆందోళన చెందాడు. ఏం చేయాలో తెలియలేదు. ఆ తరువాత పోలీస్స్టేషన్కు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. 

పోలీసులు జానీ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతిమ ఇంతకుముందు కూడా కొంతమందిని ఇలాగే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగేది అని తెలిసింది. అయితే..  ప్రతిమకు మరో వ్యక్తి సహాయం చేస్తున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది.ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

click me!