రేప్ కేసు వెనక్కి తీసుకో.. ఇల్లు, పొలం రాసిఇస్తా

First Published Jul 30, 2018, 3:01 PM IST
Highlights

తనపై 13 సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు(46)  ఆరోపిస్తూ ఆయనపై కేసు పెట్టింది. అంతేకాకుండా ఈఅ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఓ చర్చి ఫాదర్.. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు కోర్టును ఆశ్రయించగా.. ఆ కేసు వెనక్కి తీసుకుంటే.. డబ్బు, ఇల్లు ఇస్తానని బేరాలు ఆడటం మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన ఆడియో టేపులు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జలంధర్ బిషప్ ఫ్రాంకో ముల్లకల్  అనే ఓ చర్చి ఫాదర్ 2014-16 మధ్య కాలంలో  ఓ కేరళ నన్ పై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.  తనపై 13 సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు(46)  ఆరోపిస్తూ ఆయనపై కేసు పెట్టింది. అంతేకాకుండా ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో బాధితురాలికి మద్దతుగా నిలిచిన మరో నన్ (క్రైస్తవ సన్యాసిని)కి బిషప్ తరఫున ఓ మతాధికారి ఫోన్ చేశాడు. ఈ కేసును వెనక్కి తీసుకుంటే పెద్ద ఇల్లు, 10 ఎకరాల పొలం, ఆర్థిక సాయం చేస్తామని చెప్పాడు. ఒకవేళ కేసు వెనక్కి తీసుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. కేసు వాపస్ తీసుకునేలా ఆమెను ఒప్పించాలని సూచించాడు.

ఈ ఆడియో క్లిప్ ను బాధితురాలు సోమవారం పోలీసులకు అందించింది. కాగా, ఈ ఘటనపై సన్యాసిని వాంగ్మూలం తీసుకున్నామనీ, త్వరలోనే కేసు నమోదు చేస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.


 

click me!