ట్రిపుల్ తలాక్ పై కేరళ సీఎం పినరయి వ్యాఖ్యలను తిప్పికొట్టిన గవర్నర్ ఆరిఫ్

Published : Feb 24, 2023, 11:30 AM ISTUpdated : Feb 24, 2023, 11:41 AM IST
ట్రిపుల్ తలాక్ పై కేరళ సీఎం పినరయి వ్యాఖ్యలను తిప్పికొట్టిన గవర్నర్ ఆరిఫ్

సారాంశం

ట్రిపుల్ తలాక్ చట్టం వల్ల ముస్లిం మహిళల, పిల్లల భవిష్యత్తుకు భరోసా పెరిగిందని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అన్నారు. ఈ చట్టంపై కేరళ సీఎం ఈ చట్టంపై ఏమి మాట్లాడినా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమే అవుతుందని గవర్నర్ తెలిపారు. 

ట్రిపుల్ తలాక్ చట్టంపై కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తిప్పికొట్టారు. ట్రిపుల్ తలాక్ పై ఇప్పటికే చట్టం వచ్చిందని, దానితో ఎవరికైనా సమస్య ఉంటే తాము ఏమీ చేయలేమని అన్నారు. సీఎం ఏది చెప్పినా అది ఆయన సొంత అభిప్రాయమన్నారు. కానీ ట్రిపుల్ తలాక్ ఇప్పుడు సమస్య కాదని అన్నారు. ‘‘ఈ చట్టం 2019 లో అమలు చేయబడింది. ఈ చట్టంతో చాలా మంది ముస్లిం మహిళలు, పిల్లల భవిష్యత్తు సురక్షితంగా మారింది. ఎవరికైనా సమస్య ఉంటే నేనేం చేయగలను’’ అని కేరళ గవర్నర్ ప్రశ్నించారు.

మ‌నీశ్ సిసోడియాను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొల‌గింపున‌కు డిమాండ్.. ఢిల్లీలో బీజేపీ ఆందోళన

ఖురాన్‌లో కూడా ఎక్కడా ట్రిపుల్ తలాక్ ప్రస్తావన లేదని అన్నారు. అయితే దీనిపై చట్టం రాకముందే ఇలా చేసిన వ్యక్తులకు 40 కొరడా దెబ్బలు వేయాలనే నిబంధన ఉండేదని, కానీ నేడు 40 కొరడా దెబ్బలు వేయలేము కాబట్టి జైలు నిబంధన పెట్టారని అన్నారు. సీఏఏపై సీఎం వ్యాఖ్యలపై కూడా గవర్నర్ స్పందించారు. సీఎంకు తన మనసులో మాటను చెప్పే స్వేచ్ఛ ఉందని, అయితే భూ చట్టం అమలును ఎవరూ ఆపలేరని అన్నారు. కేరళ సీఎం ఏది చెబితే అది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.

2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి.. మమతా బెనర్జీ గేమ్ ఛేంజర్ - టీఎంసీ ఎంపీ శతృఘ్న సిన్హా

గత మంగళవారం కేరళ సీఎం పినరయి విజయన్ ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం, సీఏఏపై విమర్శలు చేశారు. అన్ని మతాల్లో విడాకులు జరుగుతున్నప్పుడు ముస్లిం మతంలోని ట్రిపుల్ తలాక్ ను మాత్రమే ఎందుకు నేరంగా పరిగణించారని ప్రశ్నించారు. “ట్రిపుల్ తలాక్ నేరంగా పరిగణిస్తున్నారు. విడాకులు అన్ని మతాలలో జరుగుతాయి. మిగతావన్నీ సివిల్ కేసులుగానే పరిగణిస్తారు. కేవలం ముస్లింలకు మాత్రమే ఎందుకు నేరం? విడాకుల విషయంలో ముస్లింలకు జైలు శిక్ష విధించవచ్చు. మనమంతా భారతీయులం. ఫలానా మతంలో పుట్టినందుకే మనకు పౌరసత్వం వచ్చిందని చెప్పగలమా? పౌరసత్వానికి మతం ఎప్పుడైనా ప్రాతిపదికగా ఉందా? ’’ అని ఆయన ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా పౌరసత్వాన్ని నిర్ణయించడానికి కేంద్రం మతాన్ని ఉపయోగిస్తోందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అమలు చేయబోమని కేరళ సీఎం అన్నారు. ఈ విషయంలో తమ వైఖరిని ఇది వరకే స్పష్టం చేశామని తెలిపారు. 

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, పికప్ వ్యాన్ ఢీ.. 11 మంది మృతి, 10 మందికి పైగా గాయాలు

అసలేంటి ట్రిపుల్ తలాక్ ?
‘‘తలాక్ తలాక్ తలాక్’’ అనే పదాన్ని ఉచ్ఛరించడం ద్వారా ముస్లిం భర్తలు తక్షణమే తిరుగులేని రీతిలో తమ భార్యలకు విడాకులు ఇచ్చే  పద్దతిని ట్రిపుల్ తలాక్ అంటారు. అయితే ఈ పద్దతిని 2017లో సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఆ మరుసటి ఏడాది ట్రిపుల్ తలాక్ చెల్లదని, చట్టవిరుద్ధమని ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) ఆర్డినెన్స్ 2018ను రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో ట్రిపుల్ తలాక్ నాన్ బెయిలబుల్, కాగ్నిజబుల్ నేరంగా మారింది. ట్రిపుల్ తలాక్ ను ఉపయోగిస్తే జరిమానా, 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. 
 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్