డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ఆమోదం పొందే అవకాశం..

By Asianet News  |  First Published Nov 27, 2023, 12:14 PM IST

డిసెంబర్ 4వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. రెండు రోజుల ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఇందులో పలు కీలక బిల్లులను ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3వ తేదీన వెలువడనున్నాయి. ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి డిసెంబర్ 2న ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

uttarkashi tunnel collapse : ఉత్తరకాశీ టన్నెల్... విరిగిన డ్రిల్ తొలగింపు.. నేటి నుంచి మాన్యువల్ డ్రిల్లింగ్

Latest Videos

undefined

డిసెంబర్ 4వ సమావేశాలు ప్రారంభమవుతుండగా.. దానికి ఒక రోజు ముందే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కారణంగా ఒక రోజు వాయిదా పడిందని ‘పీటీఐ’ నివేదించింది. అయితే శీతాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదించేందుకు ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ సమావేశాలపై అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

Ayushman Arogya Mandir :ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ల పేరు మార్చిన కేంద్రం.. కొత్త పేరు ఏంటంటే

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ‘క్యాష్ ఫర్ క్వైరీ’ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నివేదికను ఈ శీతాకాల సమావేశాల్లో లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. కమిటీ సిఫార్సు చేసిన బహిష్కరణ అమల్లోకి రాకముందే సభ ఈ నివేదికను ఆమోదించాల్సి ఉంటుంది. అయితే ఐపీసీ, సీఆర్ పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో మూడు కీలక బిల్లులను హోంశాఖ స్టాండింగ్ కమిటీ ఇటీవల ఆమోదించిన సంగతి తెలిసిందే. వాటిని ఈ సమావేశాల్లో పరిశీలించే అవకాశం ఉంది.

బిగ్ న్యూస్ : రైతు బంధు పంపిణీకి బ్రేక్.. అనుమతి రద్దు చేసిన ఈసీ...

ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లు కూడా పెండింగ్ లో ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందితే  కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ లకు క్యాబినెట్ హోదా రానుంది. ప్రస్తుతం వారు ప్రస్తుతం వారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాను అనుభవిస్తున్నారు. వాస్తవానికి ఈ బిల్లును గత ప్రత్యేక సమావేశాల్లోనే ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావించింది. కానీ ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో ఆమోదం కోసం ఒత్తిడి తీసుకురాలేదు. 

click me!