భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీకి బెదిరింపులు.. ‘మధ్యప్రదేశ్‌లోకి వచ్చాక బాంబ్ వేసి చంపేస్తాం’

Published : Nov 18, 2022, 02:53 PM ISTUpdated : Nov 18, 2022, 03:05 PM IST
భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీకి బెదిరింపులు.. ‘మధ్యప్రదేశ్‌లోకి వచ్చాక బాంబ్ వేసి చంపేస్తాం’

సారాంశం

మధ్యప్రదేశ్‌లోకి భారత్ జోడో యాత్ర ఎంట్రీ ఇవ్వబోతున్న తరుణంలో రాహుల్ గాంధీని చంపేస్తామనే లేఖ ఆ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ఇండోర్‌లోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీపై బాంబు వేసి చంపేస్తామని రాసిన లేఖ అక్కడ కనిపించింది. ఆ లేఖ అక్కడ వేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.  

భోపాల్: భారత్ జోడో యాత్ర చేపడుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో ఈ యాత్ర చేపడుతున్నారు. నవంబర్ 20వ తేదీన ఈ యాత్ర మధ్యప్రదేవ్‌లోకి ఎంటర్ కాబోతున్నది. ఈ తరుణంలో మధ్యప్రదేశ్‌లో రాహుల్ గాంధీపై బాంబు వేసి చంపేస్తామనే బెదిరింపు లేఖ కలకలం రేపింది. వీడీ సావర్కర్ పై ఆయన ఘాటుగా విమర్శలు చేసిన తరుణంలో ఈ బెదిరింపు లేఖ కనిపించింది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జుని పోలీసు స్టేషన్ ఏరియాలోని ఓ స్వీట్ షాపు దగ్గర ఈ బెదిరింపు లేఖ కనిపించింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. స్వీట్ షాప్ ఎదటు ఆ బెదిరింపు లేఖను ఎవరు విడిచిపెట్టారో కనిపెట్టడానికి సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

గుర్తు తెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 507 కింద కేసు ఫైల్ చేసినట్టు పోలీసు అధికారులు జాతీయ మీడియా ఇండియా టుడేకు తెలిపారు. దేశ భద్రత చట్టం కింద నిందితులు అభియోగాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.

Also Read: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో మహాత్మాగాందీ మునిమనవడు తుషార్ గాంధీ.. చరిత్రాత్మకం: కాంగ్రెస్

వీడీ సావర్కర్ పై ఆయన విమర్శలు చేసిన తర్వాతి రోజే ఈ లేఖ కనిపించింది. సావర్కర్ బ్రిటీష్ పాలకులకు సహాయం చేశాడని, భయంతో క్షమాభిక్ష పిటిషన్ రాశారని రాహుల్ గాంధీ తెలిపారు. సావర్కర్ రాసిన లేఖ నకలును చూపిస్తూ.. సావర్కర్ ఇందులో ఇలా రాశారని ఉల్లేఖనలు చేశారు. అత్యంత విశ్వాస పాత్రుడైన సర్వెంట్‌గా ఉంటానని వేడుకుంటున్నా అని రాసినట్టు ఆయన వివరించారు. ఈ లేఖపై ఆయన సంతకం పెట్టాడంటే కారణం ఏమిటని ప్రశ్నించారు. ఇది కేవలం భయం మాత్రమే అని తెలిపారు. ఆయన బ్రిటీషర్లకు భయపడ్డాడు అని ఫైర్ అయ్యారు.

Also Read: రాజీవ్ హంతకుల విడుదల.. ఆ తీర్పును పున: సమీక్షించండి: సుప్రీంకోర్ట్‌లో కేంద్రం రివ్యూ పిటిషన్

ఈ వ్యాఖ్యలు వివాదాలను, విమర్శలను తెచ్చాయి. సావర్కర్ మునిమనవడు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాహుల్ గాంధీ తన తాతను అవమానించాడని ముంబయిలో కేసు పెట్టాడు. ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ ఘటనపై స్పందిస్తూ.. తాము వీడీ సావర్కర్‌ను అపారంగా గౌరవిస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తాము ఆమోదించడం లేదని స్పష్టం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?