కోల్‌క‌తా ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. కారణమదేనా? 

Published : Nov 18, 2022, 02:47 PM IST
కోల్‌క‌తా ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. కారణమదేనా? 

సారాంశం

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ విమానం కోల్‌క‌తా నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

కోల్‌కతా విమానాశ్రయం నుండి శుక్రవారం ఉదయం బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక లోపంతో వెనక్కి తిరిగి వచ్చింది. 156 మంది ప్రయాణికులతో ముంబైకి వెళ్లే విమానం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 10:05 గంటలకు టేకాఫ్ అయింది.అయితే టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా తిరిగి రావాలనుకుంటున్నట్లు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం అందించాడు. దీంతో విమానం కోల్‌కతా విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ చేయబడింది. విమానంలో త‌లెత్తిన సాంకేతిక స‌మ‌స్య‌ను చ‌క్క‌దిద్దేందుకు ఇంజ‌నీర్లు త‌నిఖీ చేస్తున్నార‌ని అధికారులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?