భర్త వివాహేతర సంబంధం.. తట్టుకోలేక 10నెలల చిన్నారికి ఉరివేసి, తానూ ఆత్మహత్య...

Published : Aug 03, 2022, 11:24 AM IST
భర్త వివాహేతర సంబంధం.. తట్టుకోలేక 10నెలల చిన్నారికి ఉరివేసి, తానూ ఆత్మహత్య...

సారాంశం

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడం, కుటుంబకలహాలతో తట్టుకోలేక ఓ వివాహిత తన పదినెలల చిన్నారిని చంపేసి, తానూ ఆత్మహత్య  చేసుకుంది.  

కర్ణాటక : వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదురించి మరీ పెళ్లిచేసుకున్నారు. ఆ తరువాత మామూలే.. కాపురంలో కలతలు.. కలహాలు.. వీటన్నింటినీ దాటుకుని కాపురం నిలబడుతుందని ఆమె ఆశగా ఎదురుచూసింది.. కానీ అత్త, ఆడపడుచుల వేధింపులు, కలతలతకు తోడు.. జీవితాంతం నువ్వే తోడూ, నీడా అని తల్లిదండ్రుల్ని కూడా ఎదురించి ఎవరికోసమమైతే వచ్చేసిందో.. ఎవర్నైతే ప్రాణాధికంగా ప్రేమించిందో ఆ భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి తట్టుకోలేకపోయింది. కొడుకును చంపి, తానూ ఆత్మహత్య చేసుకుంది. 

హృదయ విదారకమైన ఈ ఘటన వివరాల్లోకి వెడితే... కర్ణాటక రాష్ట్రం నాగమంగల తాలూకా కెంచెగౌడనకొప్పలో ఓ యువతి కుటుంబకలహాలను తాళలేక డెత్ నోట్ రాసి బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంది. మాజీ జడ్పీ సభ్యుడు దొరెస్వామి- సునంత దంపతుల కుమార్తె బిందు, నాగమంగల కుంభార వీధి నివాసి నవీన్ నాలుగేళ్ల క్రితం ప్రేమించి, పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. 

పెళ్లైన రెండునెలలకే అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపి, ఆత్మహత్య చేసుకున్న భర్త..

పెళ్లైన కొత్తలో దంపతులిద్దరూ అన్యోన్యంగానే మెలిగారు. కానీ కాలం గడిచిన కొద్దీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. వీటికి తోడు బిందును అత్త, మామ, ఆడపడుచులు వేధించడం ప్రారంభించారు. ఇక భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఇది బిందు సహించలేకపోయింది. తన పది నెలల కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ ఉన్నా కూడా తరచుగా ఫోన్లో గొడవపడుతుండేవారు. 

దీంతో జీవితం మీద విరక్తి చెందిన బిందు.. పది నెలల కొడుకుకు ఉరివేసి తరువాత తానూ అదే వైరుతో ఉరి వేసుకుంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది. తన చారవుకు భర్త నవీన్, అత్త, మామ, ఆడపడుచులు కారణమని పేర్కొంది. నాగమంగల పోలీసులు పరిశీలించి ఇరువురి మృతదేహాలను పట్టణంలోని ప్రజా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. బిందు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu
చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్ | Praggnanandhaa Meet Cm Vijay