
అక్కడ ఓ పనస చెట్టు ఉంది. దానికి నోరూరించే పనస పళ్లు ఉన్నాయి. అంతే ఎవరికైనా ఆ పళ్లను చూస్తే తినాలని అనిపిస్తుంది కదా. ఓ ఏనుగు కూడా అంతే.. వాటిని చూడగానే తినాలి అనిపించింది. చెట్టుకి కాయలు కిందకు లేవు... ఎక్కడో పైన కొమ్మకి ఉన్నాయి. వాటిని అందుకోవడం నిజానికి ఆ ఏనుగుకు కాస్త కష్టమే. కానీ.. వాటిని వదిలేయడం వాటికి ఇష్టం లేదు. అందుకే.. చెట్టుపైకి రెండు కాళ్లు ఎత్తి మరీ.. చెట్టు మీద ఉన్న పనస పళ్లను తన తొండంతో కోసింది.
ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది ఐడియా లేదు కానీ.. దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కొందరి కామెంట్స్ ని పట్టి.. అది కేరళలో జరిగినది గా తెలుస్తోంది. కాగా.. నెటిజన్లు ఈ వీడియో చూసి ఫిదా అయిపోతున్నారు.
మొదట ఈ వీడియోని ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో.. నెట్టింట వైరల్ గా మారుతుంది. కాగా.. సుప్రియా తాను షేర్ చేసిన వీడియోకి ఓ క్యాప్షన్ కూడా జత చేశారు. ‘ మనుషులకు మామిడి పండ్లు ఎలాగో... ఏనుగులకు పనస పండ్లు అలా అనమాట. ఈ పనస పండును అందుకోవడానికి ఏనుగు చేసిన ప్రయత్నానికి మనుషులందరూ చప్పట్లు కొట్టాల్సిందే’ అంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చారు. మీరు కూడా ఈ వీడియో చూసేయండి.