17వ అంతస్తు నుంచి జారిపడి నలుగురు కార్మికులు మృతి, ఒకరి పరిస్థితి విషమం...

Published : Aug 03, 2022, 09:51 AM IST
17వ అంతస్తు నుంచి జారిపడి నలుగురు కార్మికులు మృతి, ఒకరి పరిస్థితి విషమం...

సారాంశం

25 అంతస్తుల భవననిర్మాణ పనుల్లో పదిహేడవ అంతస్తు నుంచి జారిపడి నలుగురు కార్మికులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 

గురుగ్రామ్ : గురుగ్రామ్ లో మంగళవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. సెక్టార్ 77లోని హౌసింగ్ సైట్‌లో 17 వ అంతస్తులోని ఓ ప్లాట్ ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్న ఐదుగు కార్మికులు జారిపడ్డారు. అంత ఎత్తునుంచి పడడంతో అక్కడికక్కడే వీరిలో నలుగురు మృతి చెందారు. ఐదవ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడిని వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని, తీవ్రగాయాలతో ఎమర్జెన్సీ వార్డులో మృత్యువుతో పోరాడుతున్నాడని తెలిపారు. 

వివరాల్లోకి వెడితే.. ఈ ప్రాంతంలో ఎమ్మార్ పామ్ హిల్స్ కాంపౌండ్‌ 25 అంతస్తుల టవర్‌ను నిర్మిస్తుంది. ఆ కాంపౌండ్ లో సాయంత్రం 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు కార్మికులు భవనంలోని 17వ అంతస్తులో టవర్ క్రేన్‌ను అమర్చుతుండగా, ముందుగా వారిలో ఒకరు జారిపడ్డాడు. అతను జారిపోవడంతో, మిగతా వారందరూ బ్యాలెన్స్ తప్పి ప్లాంక్ నుండి పడిపోయారని సైట్‌లోని వర్గాలు తెలిపాయి. 

మరణించిన నలుగురు కూలీలను బీహార్‌లోని కిషన్‌గంజ్‌కు చెందిన తౌహీద్ (27), కమోద్ (32), నవీన్ (28), కామేశ్వర్ (35)గా గుర్తించారు. పడిన వెంటనే వారిని సివిల్‌ ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే మృతి చెందినట్లు ప్రకటించారు. ఐదుగురు కూలీల్లో ఒక్కరు కూడా సేఫ్టీ బెల్టులు పెట్టుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని..నిర్లక్ష్య ధోరణితో నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కాంట్రాక్టర్‌పై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు ఏసీపీ (మనేసర్) సురేష్ కుమార్ తెలిపారు.

ప్రిన్సిపల్ నిర్వాకం.. మధ్యాహ్నం భోజన పథకం నుంచి.. రూ.11కోట్లు స్వాహా....

12వ అంతస్తులో భద్రత కోసం చుట్టూ వలలాంటిది కట్టినప్పటికీ ఐదుగురు కూలీలు ఒక్కసారిగా పడడంతో వారి బరువుకు అది ఆగలేదని తెలిసింది. ఈ ఐదుగురిలో ఒకరు వలలో చిక్కుకుపోవడం వల్లే గాయాలతో, ప్రాణాలతో బయటపడ్డాడు. 

"గాయపడిన కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం ఉదయం మిగిలిన నలుగురి మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించబడుతుంది. ఆ తర్వాత వారి కుటుంబాలకు అప్పగిస్తామని" కుమార్ చెప్పారు.కూలీలు పనిచేస్తున్న భవనం 25 అంతస్తుల ఎత్తులో ఉంది. "నిర్మాణ పనిలో ఎక్కువ భాగం పూర్తయినందున, చాలా మంది కార్మికులు సైట్‌నుంచి వెళ్లిపోయారు. కొంతమంది మాత్రమే అక్కడ ఉన్నారని తెలిసింది. మేము సైట్‌లో తనిఖీ చేశాం. 

డ్యూటీ మేజిస్ట్రేట్, ఇతర బృందాలు కూడా సైట్ ను సందర్శిస్తారని తెలిపారు. సైట్‌ను పరిశీలించి, వారి వైపు నుండి ఈ విషయాన్ని దర్యాప్తు చేయాలి.. త్వరలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తాం. దోషులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని కుమార్ చెప్పారు. జిల్లా టౌన్‌ప్లానర్ అమిత్ మధోలియా తన బృందంతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించి కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమన్నారు. "కార్మికులకు సేఫ్టీ హార్నెస్ బెల్ట్‌లు అందించలేదు. లేకపోతే వారు బతికేవాళ్లు. దీనిమీద విచారణ కొనసాగుతోంది. తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం" అన్నారాయన.
పతనం నుండి బయటపడిన రాజ్ కిషోర్ (30) DLF ఫేజ్ 2లోని ఉమా సంజీవిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి అనేక గాయాలు అయ్యాయని.. ఒక చేయి విరిగిందని వైద్యులు తెలిపారు.

అయితే,  సైట్‌లో పని చేస్తున్న ఇతర కూలీలకు ఈ విషయం చాలా సేపటివరకు తెలియకపోవడం విచిత్రం.. కూలీలు కొంతమంది మీడియాతో మాట్లుడుతూ... "మేము అదే భవనం టెర్రస్‌పై ఉన్నాం. కానీ, ఏం జరిగిందో మాకు తెలియదు. సాయంత్రం 5 గంటల సమయంలో మా మామయ్య ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు, ఐదుగురు కార్మికులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారని సైట్ వద్ద నాకు తర్వాత తెలిసింది." అన సాజిద్ అనే కార్మికుడు చెప్పాడు.

PREV
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు