ఢిల్లీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు ఉండకూడదు.. మీ వాదన ప్రమాదకరం - కేంద్రంతో సుప్రీం కోర్టు...

By team teluguFirst Published Jan 18, 2023, 11:03 AM IST
Highlights

జమ్మూ కాశ్మీర్ లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నప్పుడు ఢిల్లీలో ఎందుకు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీకి పీఎస్సీ ఉండకూడదనే వాదన ప్రమాదకరమని పేర్కొంది. 

ఢిల్లీతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఎస్సీ) ఉండకూడదన్న కేంద్రం వాదన ప్రమాదకరమని సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం వ్యాఖ్యానించింది. జమ్మూ కాశ్మీర్ తరహాలో ఢిల్లీకి పీఎస్సీ ఎందుకు ఉండకూడదన్న ప్రశ్నను లేవనెత్తిన ధర్మాసనం.. ‘జమ్మూకశ్మీర్ కు పీఎస్ సీ ఉన్నప్పుడు ఇతర కేంద్రపాలిత ప్రాంతాలకు ఎందుకు ఉండకూడదు? ఢిల్లీకి పీఎస్సీ ఉండదన్న మీ వాదన చాలా ప్రమాదకరం.’ అని తెలిపింది.

నడిరోడ్డుపై స్కూటీ పై వెళుతూ రొమాన్స్... వీడియో వైరల్..!

అసమర్థ అధికారులను బదిలీ చేయడానికి జీఎన్సీటీడీ (ఎన్సీటీ ఢిల్లీ ప్రభుత్వం) పై ఉన్న నిషేధం జీఎన్సీటీడీ కార్యాచరణ నియంత్రణను బలహీనపరుస్తుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘ మేము మరో విషయాన్ని కూడా ఎత్తి చూపాలనుకుంటున్నాము. ఒక అధికారి సరిగా పనిచేయకపోతే వారు (ప్రభుత్వం) అధికారులను కూడా మార్చలేరు. ఇది ఫంక్షనల్ కంట్రోల్ ను నీరుగార్చదా? ’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

దారుణం.. 13 ఏళ్ల బాలికపై పలుమార్లు సామూహిక అత్యాచారం.. 7గురు అరెస్టు..

ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు ఎస్జీ తుషార్ మెహతా సమాధానమిస్తూ.. కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ అని చెప్పారు. జీఎన్ సీటీడీకి ఎలాంటి అధికారాలు లేవనే వాదనను తోసిపుచ్చిన ఆయన.. స్టీర్, క్లచ్, గేర్ లను కలిగి ఉన్న ఫంక్షనల్ కంట్రోల్ అంతా జీఎన్ సీటీడీతో ఉందని చెప్పారు.

బ్రేకప్ చెప్పిందని... ప్రేమించిన యువతిని కత్తితో పొడిచి చంపిన మాజీ ప్రేమికుడు..

లెఫ్టినెంట్ గవర్నర్ కు వ్యతిరేకంగా ఆప్ చేస్తున్న నిరసనలను విమర్శిస్తూ.. సుప్రీంకోర్టు ముందు ఎన్నటికీ జరగడానికి వీల్లేదని తుషార్ మెహతా అన్నారు. దేశ రాజధానిలో ఏం జరిగినా ప్రపంచం చూస్తుందని, ఇది యావత్ దేశానికి అన్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వీ వాదనలు వినిపిస్తూ యూటీ, పీఎస్సీ కాన్సెప్ట్ పరస్పరం ప్రత్యేకమైనదని అన్నారు. 
 

click me!