లీప్ డే ఫిబ్రవరి 29నే ఎందుకు వస్తుంది? లీప్ ఇయర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

By SumaBala Bukka  |  First Published Jan 2, 2024, 11:35 AM IST

లీప్ ఇయర్ అంటే ఏమిటి? నాలుగేళ్లకొకసారే ఎందుకు వస్తుంది? అసలు లీప్ ఇయర్ లేకపోతే ఏమవుతుంది? లీప్ డే మంచిదేనా?


క్యాలెండర్ లో మారే రుతువుల సమతుల్యతను నిర్వహించడానికి లీపు సంవత్సరాలు, లీపు రోజులను చేర్చడం చాలా కీలకం. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి సుమారుగా 365.2422 రోజులు పడుతుంది. అంటే 365 రోజుల కంటే కొంచెం ఎక్కువ. ఆ ఎక్కువైన కాలమే లీపు సంవత్సరంలో కలుస్తుంది. ఈ లీప్ ఇయర్ క్యాలెండర్ లో కీలక పాత్ర పోషిస్తాయి. అవి లేకపోతే మన క్యాలెండర్ సమతుల్యతను కోల్పోతుంది. 

అలా 2024 లీప్ ఇయర్‌గా మారింది. అంటే ఫిబ్రవరి 2024లో సాధారణ 28 రోజులకు బదులుగా 29 రోజులు ఉంటాయి. లీపు సంవత్సరాలు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. గత లీపు సంవత్సరం 2020లో రాగా, భవిష్యత్తులో 2028లో లీప్ ఇయర్ రానుంది. 

Latest Videos

undefined

2024 లీపు సంవత్సరమా?
2024 లీప్ ఇయర్.  సాధారణంగా సంవత్సరంలో ఉండే 365 రోజులకు బదులుగా ఈ యేడాది 366 రోజులు ఉంటాయి. 

లీప్ డే అంటే ఏమిటి?
లీప్ డే అనేది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఫిబ్రవరి చివరిలో కలిసే అదనపు రోజు. దీని వల్ల ఫిబ్రవరిలో సాధారణంగా 28 రోజులకుబదులుగా 29 రోజులు ఉంటాయి.

జొమాటో, స్విగ్గీ ఆల్‌టైమ్ రికార్డు: డిసెంబర్ 31న నిమిషానికో ఆర్డర్, బిర్యానీలో హైద్రాబాద్ ఫస్ట్

లీప్ ఇయర్, లీప్ డేలు ఎందుకంటే..
మన క్యాలెండర్‌ లో సీజన్‌లు మారుతుంటాయి. వాటన్నింటి మధ్య సమతుల్యత ఉండాలంటే లీప్ ఇయర్‌లు, లీప్ డేలు అవసరం. భూమి సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి దాదాపు 365.2422 రోజులు పడుతుంది. అంటే మనం సంవత్సరానికి లెక్కించే 365 రోజులకంటే ఇది కొంచెం ఎక్కువ. ఒకరోజులో పావు వంతు అన్నమాట. దాన్ని ఎటూ లెక్కించలేం కాబట్టి.. నాలుగేళ్లకొకసారి కలిపి పూర్తి రోజుగా లీప్ డేగా గుర్తిస్తారు. లీప్ ఇయర్ లేకపోతే, క్యాలెండర్ క్రమంగా సీజన్‌లకు అనుగుణంగా లేకుండా పోతుంది.

లీప్ ఇయర్ ను ఎలా గుర్తిస్తారు?
నాలుగుతో భాగించగలిగే సంవత్సరాలను లీప్ ఇయర్ గా గుర్తిస్తారు. వందతో భాగించబడే సంవత్సరం దీనికి మినహాయింపు. అయితే ఇందులో మరో మెలిక ఉంది. 400లతో భాగించబడే సంవత్సరం కూడా లీప్ ఇయర్ కిందికే వస్తుంది. ఎలాగంటే.. ఉదాహరణకు, 2000 సంవత్సరం లీపు సంవత్సరం, కానీ 2100 సంవత్సరం కాదు.

ఫిబ్రవరిలోనే లీప్ డే ఎందుకు?
లీప్ డేని ఫిబ్రవరి నెలకే ఎందుకు కలుపుతారు? ఈ నెలనే ఎందుకు ఎన్నుకున్నారంటే... దీని మూలాలు పురాతన రోమ్‌లోని జూలియస్ సీజర్ క్యాలెండర్ సంస్కరణలలో ఉన్నాయి. ఆ సమయంలో ఆ క్యాలెండర్ లో మార్పులను ఫిబ్రవరి నెలలోనే చేశారు. అప్పటినుంచి అలాగే కొనసాగుతుంది. ఈజిప్షియన్ సౌర క్యాలెండర్ నుండి ప్రేరణ పొందిన సీజర్ జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాడు.

ఇందులో క్యాలెండర్ సంవత్సరాన్ని సౌర సంవత్సరంతో సమలేఖనం చేయడానికి లీప్ ఇయర్ కూడా ఉంది. 1582లో జూలియన్ క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్‌గా పరిణామం చెందిన తర్వాత కూడా, ఫిబ్రవరికి లీప్ డేని జోడించే సంప్రదాయం కొనసాగింది.

లీప్ డేకి సంబంధించి సంప్రదాయాలు, మూఢనమ్మకాలు...

లీప్ డేకి సంబంధించి కొన్ని సంప్రదాయాలు, మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి.

1. సాడీ హాకిన్స్ డే : ఈ సంప్రదాయం 1937లో కామిక్ స్ట్రిప్ నుండి ఏర్పడింది. సాధారణంగా పురుషులు స్త్రీలకు ప్రపోజ్ చేస్తారు. కానీ సాడీ హాకిన్స్ డే నాడు స్త్రీలు పురుషులకు ప్రపోజ్ చేసేలా ప్రోత్సహిస్తారు. స్త్రీలు పురుషులను డేట్ కి రమ్మనేలా కోరమంటారు. సంప్రదాయ జెండర్ రోల్ ను తిరగరాస్తారు. 

2. వివాహాలకు దురదృష్టం : కొన్ని సంస్కృతులలో, లీప్ డేని దురదృష్టకరమైన రోజుగా పరిగణిస్తారు.. ముఖ్యంగా వివాహాలకు. స్కాట్లాండ్‌లో అయితే.. జనాల్లో అల్లర్లు, ఆందోళనలు కలిగించడానికి మంత్రగత్తెలు ఒకచోట చేరే రోజు లీప్ డే అని నమ్ముతారు. గ్రీస్‌లో, లీపు సంవత్సరంలో, ముఖ్యంగా లీప్ డే రోజున వివాహం చేసుకోవద్దని సలహా ఇస్తారు.

3. ప్రత్యేక ఈవెంట్‌లు, పండుగలు : కొన్ని ఈవెంట్‌లు, పండుగలు ప్రత్యేకంగా లీప్ రోజున నిర్వహించబడతాయి, ఉదాహరణకు హానర్ సొసైటీ ఆఫ్ లీప్ ఇయర్ డే బేబీస్, ఇది ఫిబ్రవరి 29న జన్మించిన వ్యక్తుల కోసం ఏర్పడిన ఒక క్లబ్.

లీప్ ఇయర్స్ అనేవి మన సమయపాలన వ్యవస్థ లోని ఆకర్షణీయమైన అంశం, మన క్యాలెండర్ సూర్యుని చుట్టూ భూమి ప్రయాణానికి అనుగుణంగా ఉండేలా చూసుకుంటుంది.

click me!