భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందనలు.. భారతీయులకు కంగ్రాట్స్

By telugu team  |  First Published Oct 21, 2021, 2:15 PM IST

టీకా పంపిణీలో కీలకమైలురాయి దాటిని భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందనలు తెలిపింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయులకు కంగ్రాట్స్ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ ఈక్విటీ సాధించే లక్ష్యాల్లోనూ భారత్ పురోగతి సాధించిందని వివరించారు.
 


న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన Vaccination క్రమంగా వేగం పుంజుకున్నది. తొలుత మందగమనంతో సాగినా ఇప్పుడు రోజుకు సుమారు 80 లక్షల Doseలను పంపిణీ చేస్తున్నారు. Vaccine పంపిణీ ప్రారంభమైన కొద్ది రోజులకే వ్యాక్సిన్ కొరత కూడా ఏర్పడింది. దీంతో ‘వ్యాక్సిన్ మైత్రి’ కింద ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న టీకాలను తాత్కాలికంగా నిలిపేసింది. మళ్లీ ఇప్పుడు ప్రారంభించింది. తాజాగా, India టీకా పంపిణీలో కీలక మైలురాయిని దాటింది. నేటితో దేశంలో వంద కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేసుకుంది. ఈ చరిత్రాత్మక రికార్డును పేర్కొంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ ఫీట్‌పై భారత్‌కు కంగ్రాట్స్ తెలిపింది.

భారత్ చరిత్ర సృష్టించింది. భారత విజ్ఞానం, సంస్థలు, 130 కోట్ల భారతీయుల సమ్మిళిత కృషిని చూస్తున్నాం. వంద కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ఇండియాకు నా అభినందనలు. భారత వైద్యులు, నర్సులు, ఈ ఘనత సాధించడానికి పనిచేసినంవారందరికీ కృతజ్ఞతలు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై పౌరులు, ప్రముఖులు ఎందరో స్పందించి రీట్వీట్లు చేశారు. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియసస్ కూడా ప్రధానికి రీట్వీట్ చేస్తూ కంగ్రాట్స్ చెప్పారు.

Latest Videos

undefined

Also Read: ఎయిమ్స్ క్యాంపస్‌లో విశ్రమ్ సదన్ ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, శాస్త్రవేత్తలు, హెల్త్ వర్కర్లు, భారత ప్రజలందరికీ అభినందనలు. కొవిడ్-19 బారినపడే బలహీనులను కాపాడటానికి కృషి చేసినవారందరికీ కంగ్రాచ్యులేషన్స్. వ్యాక్సిన్ ఈక్విటీ లక్ష్యాలను ఛేదించడానికి పాటుపడుతున్నారు’ అని ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ట్వీట్ చేశారు.

 

Congratulations, Prime Minister , the scientists, and people of , on your efforts to protect the vulnerable populations from and achieve targets.https://t.co/ngVFOszcmE

— Tedros Adhanom Ghebreyesus (@DrTedros)

వంద కోట్ల డోసుల టార్గెట్ చేరిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ హెల్త్ వర్కర్లకు అభినందనలు తెలిపారు. రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టులలో ప్రత్యేక ప్రకటనలు ఇచ్చారు. చరిత్రాత్మక కట్టడాలపై త్రివర్ణ కాంతులను వెదజల్లే లైట్‌లను ఏర్పాటు చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ఈ ఘనతపై స్పందించారు. భారత్‌కు అభినందనలు తెలిపారు. దార్శనిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఇది సాధ్యపడిందని ట్వీట్ చేశారు.

click me!