ఈ డౌట్ మీకొచ్చిందా... అసలు ఒక్క ఈవీఎం రేటెంత..?

By sivanagaprasad kodatiFirst Published Nov 23, 2018, 11:33 AM IST
Highlights

ఈవీఎంల సాఫ్ట్‌వేర్ మార్చడం ద్వారా ఏ బటన్ నొక్కినా ఒకే అభ్యర్థికి ఓటు పడేలా వీలుందంటూ.. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని నిషేధించాలని కోరుతున్నాయి.

ఈవీఎంల సాఫ్ట్‌వేర్ మార్చడం ద్వారా ఏ బటన్ నొక్కినా ఒకే అభ్యర్థికి ఓటు పడేలా వీలుందంటూ.. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని నిషేధించాలని కోరుతున్నాయి. దీనిపై పలు సందర్భాల్లో సుప్రీంకోర్టులో సైతం పిటిషన్లు వేశారు.

తాజాగా గురువారం ఒక పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం బ్యాలెట్ పేపర్ కంటే ఈవీఎంల వైపే మొగ్గుచూపింది.  ఈ క్రమంలో ఈవీఎంల గురించి ఎక్కడ చూసినా చర్చ మొదలైంది. ఒకప్పుడు ఎన్నికలంటే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల హడావిడి కనిపించేది.

దీని వల్ల కోట్లాది బ్యాలెట్ పేపర్ల ముద్రణతో పాటు దాని తరలింపు కోసం ధనంతో పాటు సమయం వృథా అయ్యేది. దీనికి పరిష్కారంగా భారత ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టింది.

దీని వల్ల కోట్లకొద్దీ బ్యాలెట్ కాగితాలను ముద్రించాల్సిన అవసరం ఉండదు.. ఈవీఎంలను రవాణా చేయడం, భద్రపరచడం సులభం, ఓట్ల లెక్కింపును కూడా చాలా తక్కువ సిబ్బందితోనే పూర్తి చేయవచ్చు. కాకపోతే ఈవీఎంల కోసం ముందుగా పెద్ద మొత్తం వినియోగించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఎమ్3 రకం ఈవీఎం మెషిన్లను ఎన్నికల సంఘం ఉపయోగిస్తోంది. ఒక్కో యంత్రం ధర రూ. 17 వేలు. 2009 సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలను వాడటం వల్ల దాదాపు 10 వేల టన్నుల కాగితం ఆదా అయ్యింది.
 

ఎన్నికల్లో ఈవీఎంలా.. బ్యాలెట్ పేపర్లా: సుప్రీం ఓటు దేనికి

సంచలనం: ఈవీఎంల పనితీరుపై అనుమానాలు, ట్యాంపరింగ్‌కు ఛాన్స్: బాబు

ఈవీఎం చోరీ కేసులో నిందితుడికి పదవి

ఈవీఎంలను ఇలా టాంపరింగ్ చేయోచ్చట!

click me!