కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు ఉగ్రవాదులు హతం

sivanagaprasad kodati |  
Published : Nov 23, 2018, 11:08 AM IST
కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు ఉగ్రవాదులు హతం

సారాంశం

భారీ ఎత్తున ఉగ్రవాదుల ఏరివేతకు శ్రీకారం చుట్టిన భారత సైన్యం ఇవాళ జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌లో మరో ఆరుగురు తీవ్రవాదులను అంతం చేసింది. 

భారీ ఎత్తున ఉగ్రవాదుల ఏరివేతకు శ్రీకారం చుట్టిన భారత సైన్యం ఇవాళ జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌లో మరో ఆరుగురు తీవ్రవాదులను అంతం చేసింది. ఈ తెల్లవారుజామున అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌భేరా ప్రాంతంలో ముష్కరులు ఉన్నారని సమాచారం అందడంతో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి.

ఈ నేపథ్యంలో సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమవ్వగా.. వారి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం తెలిపింది. కొద్దిరోజుల క్రితం షోపియాన్ జిల్లాలో జిరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. 

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!