Cold Wave: చలి చంపేస్తోంది బాబోయ్.. మైన‌స్ డిగ్రీల‌కు ఉష్ణోగ్ర‌త‌లు.. అధికారుల హెచ్చరిక‌లు

By Mahesh Rajamoni  |  First Published Dec 18, 2021, 12:54 PM IST

 Cold Wave:  దేశంలో చ‌లి పంజా విసురుతోంది. మ‌రీ ముఖ్యంగా ఉత్త‌ర‌భార‌తంలో చ‌లి తీవ్ర‌త క్ర‌మంగా పెరుగుతున్న‌ది. దేశ‌రాజ‌ధాని ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో చ‌లి తీవ్ర‌త పెరుగుతూ.. ఉష్ణోగ్ర‌త‌లు మైన‌స్ డిగ్రీల‌కు ప‌డిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌త వాతావ‌ర‌ణ విభాగం హెచ్చ‌రిక‌లు జారీ చేస్తూ.. పలు ప్రాంతాలకు   ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది.
 


Cold Wave: గ‌త కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చలితీవ్రత పెరుగుతూ వస్తున్న‌ది. చాలా ప్రాంతాల‌ను చ‌లి గ‌జ‌గ‌జ వ‌ణికిస్తున్నది. ఇప్పటికే  దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు క‌నిష్ట స్థాయికి ప‌డిపోతున్నాయి. మ‌రీ ముఖ్యంగా ప్ర‌స్తుతం ఉత్త‌ర భార‌తంపై చ‌లి పంజా విసురుతోంది. ఉత్తరాధి రాష్ట్రాలతో పాటు దేశమంతటా ఉష్ణోగ్రత్తలు పడిపోతున్నాయి. ఢిల్లీలో కనిష్టంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై చలి చంపేస్తుంది. ఈ  వారాంతంలో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతుందని భార‌త  వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజస్థాన్‌లో లో అయితే ఉష్ణోగ్ర‌త‌లు ఏకంగా మైన‌స్ స్థాయికి ప‌డిపోయాయి. రాజ‌స్థాన్ లో తాజాగా  మైనస్ 3.3 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదుకావ‌డంతో వాతావ‌ర‌ణ విభాగం చ‌లి హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఇక్క కనిష్ట ఉష్ణోగ్రత సికార్‌లోని ఫతేపూర్‌లో మైనస్ 3.3 డిగ్రీల సెల్సియస్‌గా న‌మోదైంది. దీనికి పొరుగున ఉన్న చురులో మైనస్ 1.1 డిగ్రీలుగా ఉష్ణోగ్ర‌త నమోదైంది. రానున్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది.

Also Read:  Omicran: మూడు డోసులు తీసుకున్నా వదలని ఒమిక్రాన్‌..

Latest Videos

undefined

 

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోనూ ఉష్ణోగ్ర‌త‌లు క‌నిష్ట స్థాయికి ప‌డిపోతున్నాయి. దీంతో చ‌లి తీవ్ర‌త పెరుగుతోంది. శనివారం కనిష్టంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు న‌మోదుకాగా,  గరిష్టంగా 19 డిగ్రీలు మాత్రమే ఉంది. ఇదిలావుండ‌గా ఢిల్లీ కాలుష్యం గ‌త కొంత కాలంగా గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. దీంతో  పొగమంచు, చలితో పాటు కాలుష్య తీవ్రత పెరగడంతో ప్రజల ఇబ్బందులు మ‌రింత‌గా పెరిగాయి. అలాగే, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమగిరుల్లో భారీగా హిమపాతం చవిచూస్తుందని రికార్డులు చెబుతున్నాయి. అక్క‌డి ఇప్ప‌టికే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయాయి. దీంతో ప్ర‌జ‌లు ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌డం బాగా త‌గ్గిపోయింది. హిమాలయాల నుంచి వీస్తున్న చ‌లి  గాలులతో కార‌ణంగా దేశంలోని ప‌లు ప్రాంతాలో ఉష్ణోగ్ర‌తల క‌నిష్టానికి ప‌డిపోవ‌డంతో పాటు చ‌లి తీవ్ర‌త పెరుగుతోంది.ఈ చ‌లి గాలుల ప్ర‌భావంతో  రాజస్థాన్‌, పంజాబ్, హర్యానా, ఢిల్లీ,  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ల‌లో చ‌తి తీవ్ర‌త అధికంగా పెరిగింది. జ‌మ్మూకాశ్మీర్ లో రికార్డు క‌నిష్టానికి ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయాయి.  ఉత్తర కశ్మీర్, గుల్‌మార్గ్, పహాల్ గామ్, లద్దాఖ్, లేహ్ ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు న‌మోద‌వుతున్నాయి. 

Also Read:  Omicron | అదే జరిగితే రోజుకు 14 లక్షల కేసులు.. ఒమిక్రాన్‌పై కేంద్రం హెచ్చరికలు

ద‌క్షిణ భార‌తంలోనూ చ‌లి తీవ్ర‌త పెరుగుతోంది. మ‌రీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు క‌నిష్టానికి ప‌డిపోతున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చ‌లి తీవ్ర‌త పెరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. విశాఖ జిల్లా చింతపల్లిలో 6.1డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరు, వంటల మామిడిలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత, అరకులోనూ 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి.  చ‌లి కాలంలో ఈ  స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోవ‌డం ఇదే మొద‌టి సారి అని అధికారులు చెబుతున్నారు.  తెలంగాణ‌లోనూ ప‌లు ప్రాంతాల్లో చ‌లి పంజా విసురుతోంది. ఆదిలాబాద్ , కుమ్రంభీం, నిర్మ‌ల్‌, జ‌గిత్యాల వంటి ప్రాంతంలో చ‌లి ఎక్క‌వ‌వుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలను పొగ‌మంచు కప్పేస్తోంది. పొద‌యం 5 గంట‌ల నుంచే చ‌ల్ల‌గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో చ‌లి తీవ్ర‌త పెరగ‌డంతో ప్ర‌జ‌లు ఆరోగ్య జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న‌పిల్ల‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. చ‌లి నుంచి కాపాడే దుస్తులు ధ‌రించాల‌ని సూచిస్తున్నారు.

Also Read: CM KCR: 23న వ‌న‌ప‌ర్తికి కేసీఆర్‌.. సీఎం జిల్లా పర్యటన షెడ్యూల్‌లో మార్పులు

click me!