Anti-Conversion Bill: మతం మార్చితే.. ప‌దేండ్ల జైలు శిక్ష‌.. రూ. లక్ష జ‌రిమానా

Published : Dec 18, 2021, 12:08 PM ISTUpdated : Dec 18, 2021, 12:34 PM IST
Anti-Conversion Bill: మతం మార్చితే.. ప‌దేండ్ల  జైలు శిక్ష‌.. రూ. లక్ష జ‌రిమానా

సారాంశం

Anti-Conversion Bill: కర్ణాటకలో బీజేపీ ప్ర‌భుత్వం కీల‌క చ‌ట్టాన్ని తీసుక‌రానున్న‌ది. మతమార్పిడుల వ్య‌తిరేకంగా.. మ‌త మార్పిడిల‌ను నిరోధక బిల్లు ప్రతిపాదనకు తీసుక‌వ‌చ్చింది. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఈ ముసాయిదాను ప్రవేశ‌పెట్టాలిని..  మతమార్పిడులకు పాల్పడితే 10ఏళ్ల జైలు, రూ. లక్ష జ‌రిమాన విధించేలా చ‌ట్టం చేయ‌నున్న‌ది. 

Anti-Conversion Bill: కర్ణాటకలో మత మార్పిడిలు విపరీతంగా జరుగుతున్నాయని, వాటికి అడ్డు క‌ట్ట వేయ‌డానికి క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. మ‌త మార్పిడిల‌ను నిరోధించడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టడానికి అధికార బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ క్ర‌మంలో మతమార్పిడులకు వ్య‌తిరేకంగా బిల్లు 
తీసుకరావాల‌ని ప్రతిపాదనకు వచ్చింది. 

ప్ర‌స్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని అధికార బీజేపీ భావిస్తోంది. అయితే..  ప్రతిపాదిత చట్టం చెల్లుబాటు అవుతుందా లేదా అనే విషయాలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా వరుస భేటీల‌ను నిర్వహిస్తోంది. అయితే.. ఈ బిల్లులో విధించే శిక్షలపైనే.. 
భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని తెలుస్తోంది. అయితే .. త్వ‌ర‌లోనే ఈ విష‌యంలో కేబినెట్ తుది నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్టు సమాచారం.

Read Also: బార్డ‌ర్ మార్కుల‌తో ఇంట‌ర్ విద్యార్థులు పాస్‌ ? ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో తెలంగాణ విద్యాశాఖ యోచ‌న‌..
  
కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజన్ బిల్ 2021 ముసాయిదాలో బలవంతపు మతమార్పిడిలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ ముసాయిదా ప్ర‌కారం.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనర్లు మరియు మహిళలను బలవంతంగా మతమార్పిడి చేస్తే గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షను వేయాలని, లేదా రూ. లక్ష జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. 

Read Also: Omicran: మూడు డోసులు తీసుకున్నా వదలని ఒమిక్రాన్‌..

ఈ ముసాయిదా ప్ర‌కారం.. ఎవ్వ‌రైనా.. త‌మ మతాన్ని మార్చుకోవాలంటే.. నెల రోజుల గ‌డువు ఇచ్చాల‌ని,  ఫామ్ 2లో భాగంగా ఎవరైనా జిల్లా మెజిస్ట్రేట్ లేదా అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కు నోటీసు పంపాల్సి ఉంటుందని చెప్పారు. తమకు తామే మార్చుకుని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అటువంటి మార్పిడులను పట్టించుకోవలసిన అవసర్లేదని పేర్కొన్నారు. 
  
కాగా,  వివిధ రాష్ట్రాల్లో మతమార్పిడి చ‌ట్టాల‌ను పరిశీలించి.. ఈ ముసాయిదాను రూపొందిచామ‌ని, న్యాయ ప‌ర‌మైన సమస్యలు వచ్చినప్పుడు కోర్టు ఆధ్వ‌ర్యంలో తేల్చుకునే విధంగా ఈ ముసాయిదా రూపొందించామని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ ముసాయిదా బిల్లును డిసెంబర్ 20న రాష్ట్ర కేబినేట్ లో ప్ర‌వేశ‌పెట్టాల‌ని భావిస్తోన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఈ  ముసాయిదా బిల్లుకు కేబినేట్ ఆమోదం వ‌స్తే.. వచ్చేవారం శాసనసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.

Read Also: US report on terrorism: తీవ్రవాదానికి పాకిస్థాన్ స్వర్గధామం

2023లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ బిల్లును ప్ర‌చారం ఆస్త్రంగా వాడుకోవ‌చ్చ‌ని బీజేపీ భావిస్తోంది. శాసన మండలిలో ఉమ్మడి ప్రతిపక్షం చేతిలో ఓడిపోయే అవకాశం ఉన్నప్పటికీ బిల్లును ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది. మ‌రోవైపు.. ఈ బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నాయి  ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు. 

వివిధ రాష్ట్రాల్లో అమ‌ల్లో ఉన్న‌ చట్టం ప్ర‌కారం.. మైనర్, స్త్రీ లేదా షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగకు చెందిన వారు ఈ చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తే.. సెక్షన్ 3 ప్ర‌కారం.. 3 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. ఇది రూ. 50వేల వరకూ ఉండొచ్చని చెబుతున్నారు. సామూహిక మత మార్పిడికి పాల్పడితే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధించబడుతుంది.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్