Lord Rama: మేం గాంధీ రాముడిని కొలుస్తాం.. బీజేపీ రాముడిని కాదు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

By Mahesh K  |  First Published Jan 22, 2024, 7:51 PM IST

మేం గాంధీ రాముడిని కొలుస్తాం గానీ, బీజేపీ రాముడిని పూజించమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. బీజేపీ వాళ్లు రాముడిని సీతా దేవి, లక్ష్మణుడికి దూరం చేస్తున్నారని తెలిపారు. లక్ష్మణుడు సర్వంతర్యామి అని,  ఆయనను కేవలం అయోధ్యకే పరిమితం చేయరాదని వివరించారు.
 


Ayodhya: ఈ రోజు ఎంతో ఘనంగా అయోధ్యలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఆహ్వానాలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరుకాలేవు. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం, కాంగ్రెస్ లీడర్ సిద్ధరామయ్య మాట్లాడారు. ‘మేం (కాంగ్రెస్) గాంధీ రాముడిని కొలుస్తాం, కానీ, బీజేపీ రాముడిని కాదు’ అని అన్నారు.

బీజేపీ పై విమర్శలు సంధిస్తూ ఆయన మాట్లాడారు. రాముడిని సీతాదేవి, సోదరుడు లక్ష్మణుడి నుంచి దూరం చేసే కుట్ర జరుగుతున్నదని సిద్ధరామయ్య విమర్శించారు. ‘లక్ష్మణుడు, సీతా లేకుండా రాముడు ఉండలేడు. రాముడు సర్వంతర్యామి. ఆయనను కేవలం అయోధ్యకే పరిమితం చేయలేం. ఆయన మా ఊరిలో నిర్మించిన శ్రీరాముడి ఆలయంలోనూ ఉంటాడు’ అని వివరించారు. మహదేవపుర జిల్లాలో రాముడు, సీత, లక్ష్మణ్, హనుమాన్ విగ్రహాలను ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Latest Videos

‘శ్రీ రాముడు అందరివాడు. ఆయన బీజేపీ వాళ్ల దేవుడు కాదు. హిందువులందరి దేవుడు. మేం కూడా రాముడి భక్తులమే... ఒక రోజు నేను కూడా అయోధ్యకు వెళ్లివస్తాను’ అని సిద్ధరామయ్య అన్నారు.

Also Read : Pakistan: రామ మందిరం ఓపెనింగ్ పై పాకిస్తాన్ ఫైర్.. ఏమన్నదంటే?

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమంగా మార్చివేశారని, అందుకే తాము ఆ కార్యక్రమానికి హాజరుకాబోమని కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించిన సంగతి తెలిసిందే. మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు ఆహ్వానాలు అందాయి. కానీ, పార్టీ ఈ కార్యక్రమానికి హాజరుకారాదని నిర్ణయం తీసుకుంది.

ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాకపోవడంపైనా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ‘మమ్మల్ని (కాంగ్రెస్ వాళ్లను) శ్రీరాముడికి వ్యతిరేకులుగా చిత్రించాలని వాళ్లు (బీజేపీ) అనుకుంటున్నారు. కానీ, అది తప్పు. అయోధ్యలోని శ్రీరాముడికి మేం వ్యతిరేకులం కాదు. వాళ్లు ఇదంతా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారు’ అని సిద్ధరామయ్య అన్నారు. తాము అయోధ్య రాముడిని వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు.

click me!