అయోధ్య రామ మందిరం కాంప్లెక్స్‌లో భక్తుడికి గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

By Mahesh K  |  First Published Jan 22, 2024, 5:49 PM IST

అయోధ్య రామ మందిరం కాంప్లెక్స్‌లో ఓ భక్తుడికి గుండెపోటు వచ్చింది. ఎయిర్ ఫోర్స్ తక్షణమే రంగంలోకి దిగింది. ఆన్‌సైట్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక హాస్పిటల్ వద్దకు సిబ్బంది తీసుకెళ్లారు. ఆ తర్వాత సివిల్ హాస్పిటల్‌కు తరలించారు.
 


Ayodhya: ఈ రోజు అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు, భక్తులు విచ్చేశారు. మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుండగా ఆలయ ప్రాంగణంలోనే ఉన్న ఓ భక్తుడికి గుండెపోటు వచ్చింది. 

65 ఏళ్ల రామకృష్ణ శ్రీవాస్తవ టెంపుల్ కాంప్లెక్స్‌లోనే కులిపోయాడు. ఇది గమనించిన ఎయిర్ ఫోర్స్ వేగంగా స్పందించి ప్రాణాలు కాపాడింది. వింగ్ కమాండర్ మనీశ్ గుప్తా సారథ్యంలోని భిష్మ్ క్యూబ్ టీమ్ వెంటనే శ్రీవాస్తవను ఆన్‌సైట్‌లోనే ఏర్పాటు చేసి అత్యవసర తాత్కాలిక హాస్పిటల్‌లో చేర్చారు. దీంతో గోల్డెన్ అవర్‌లో శ్రీవాస్తవకు ట్రీట్‌మెంట్ అందింది.

Latest Videos

ప్రాథమిక అసెస్‌మెంట్‌లో శ్రీవాస్తవకు బీపీ తీవ్ర స్థాయిలో వచ్చిందని తెలిసింది. అత్యంత ప్రమాదకరంగా 210/170 ఎంఎం హెచ్‌జీకి బీపీ పెరిగిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాథమిక చికిత్స సమయానికి అందింది. ఆ తర్వాత తదుపరి చికిత్స, స్పెషలైజ్డ్ కేర్ కోసం సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read : Ayodhya: రేపటి నుంచి దర్శనం షురూ.. టైమింగ్స్ ఇవే.. ఆన్‌లైన్‌లో పాస్‌లు ఇలా పొందండి

అయోధ్యలో వైద్యపరమైన అవసరాల కోసం అరోగ్య మైత్రి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ కింద రెండు క్యూబ్ భీష్మ్ మొబైల్ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేశారు.

click me!