రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్ట తర్వాత ఆ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి యోగి రాజ్ స్పందించారు.
న్యూఢిల్లీ: భూమిపై తాను అత్యంత అదృష్టవంతుడినని రామ్ లల్లా విగ్రహాన్నితయారు చేసిన శిల్పి యోగిరాజ్ చెప్పారు. అయోధ్య ఆలయానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన శిల్పి అరుణ్ యోగి రాజ్ తయారు చేసిన రామ్ లల్లా విగ్రహం ఎంపికైంది. రామ్ లల్లా విగ్రహా ప్రతిష్టాపన తర్వాత శిల్పి యోగిరాజ్ మీడియాతో మాట్లాడారు. అరుణ్ యోగిరాజ్ అనేక విగ్రహాలను తయారు చేశారు. అయోధ్య రామ మందిరంలో అరుణ్ యోగి రాజ్ తయారు చేసి విగ్రహాం ఎంపికైంది. ఇవాళ రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్ట జరగడంతో అరుణ్ యోగిరాజ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ప్రాణ ప్రతిష్ట తర్వాత రాముడి విగ్రహం కళ్లకు కట్టిన గంతాలను విప్పారు. ఈ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు.తాను ఇప్పుడు భూమిపై అత్యంత అదృష్టవంతుడిగా భావిస్తున్నానని యోగి రాజ్ చెప్పారు.తన పూర్వీకులు,కుటుంబ సభ్యులు, భగవంతుడు రామ్ లల్లా ఆశీర్వాదం తనకు ఎప్పుడూ ఉంటుందన్నారు.కొన్నిసార్లు తాను కలల ప్రపంచంలో ఉన్నట్టుగా అనిపిస్తుందన్నారు. అయోధ్యలో రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత యోగి రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
undefined
రామ్ లల్లా విగ్రహాన్ని గత వారం గర్బగుడిలో ప్రతిష్టించారు. ఐదేళ్ల వయస్సు గల కమలంపై నిలబడి ఉన్నట్టుగా చిత్రీకరించారు.నల్లరాతితో అరుణ్ యోగిరాజ్ 51 ఇంచుల విగ్రహం రూపొందించారు.రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం 12 రోజులుగా సాగుతుంది. ఈ కార్యక్రమానికి 11 రోజులుగా డాక్టర్ అనిల్ మిశ్రా ప్రధాన కర్తగా వ్యవహరించారు. ఇవాళ జరిగిన ప్రధాన పూజకు నరేంద్ర మోడీ ప్రధాన కర్తగా వ్యవహరించారు.
కేదార్ నాథ్ లో ఆది శంకరాచార్య, ఢిల్లీలోని ఇండియా గేట్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను కూడ ఆయన తయారు చేశారు. ఈ విగ్రహా తయారీ సమయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో మాట్లాడలేదు.మైసూరులోని ఐదు తరాల ప్రఖ్యాత శిల్పుల కుటుంబ వారసత్వాన్ని అరుణ్ యోగి రాజ్ పుణికి పుచ్చుకున్నాడు. దేశంలోనే అత్యంత డిమాండ్ గా ఉన్న శిల్పిగా అరుణ్ యోగి రాజ్ కు పేరుంది.
also read:అయోధ్య రామ మందిరం: నిర్మాణంలో పాల్గొన్న సిబ్బందిపై పూల వర్షం కురిపించిన మోడీ
అరుణ్ తండ్రి యోగిరాజ్ కూడ నైపుణ్యం కల శిల్పి. అతని తాత బసవన్న మైసూరు రాజు నుండి ప్రోత్సహన్ని పొందారు.ఇండియా గేట్ వద్ద 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహం , కేదార్ నాథ్ లోని 12 అడుగుల ఆది శంకరాచార్య విగ్రహం, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కార్, స్వామి రామకృష్ణ పరమహంసతో సహా పలు ఇతర విగ్రహాలను తయారు చేశారు.