ఆ కాంగ్రెస్ ‘కచ్రా’ వద్దనే అనుకుంటున్నాం.. పంజాబ్‌లో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

Published : Nov 23, 2021, 08:01 PM IST
ఆ కాంగ్రెస్ ‘కచ్రా’ వద్దనే అనుకుంటున్నాం.. పంజాబ్‌లో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లో అధికార పార్టీ కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి తమ పార్టీలోకి రావడానికి 25 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు టచ్‌లో ఉన్నారని వివరించారు. కానీ, వారిని పార్టీలోకి తీసుకోవాలని భావించడం లేదని అన్నారు. ఆ కాంగ్రెస్ కచ్రా వద్దనే అనుకుంటున్నామని విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు.  

చండీగడ్: Punjab అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం Arvind Kejriwal మరోసారి ఆ రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం పంజాబ్‌లో Campaign నిర్వహించారు. తాజాగా మంగళవారం ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న Congressపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల గురించే మాట్లాడాలనుకుంటే తమ పార్టీ నుంచి బయటికి వెళ్లడమే కాదు.. వేరే పార్టీల నుంచీ తమ పార్టీలోకి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని అన్నారు. కనీసం 25 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఆప్‌తో టచ్‌లో ఉన్నారని వివరించారు. కానీ, ఆ కచ్రా(చెత్త)ను వద్దనే అనుకుంటున్నామని వ్యాఖ్యలు చేశారు.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఆప్ పార్టీ నుంచి బయటకు వెళ్లుతున్నారని, ఇతర పార్టీల్లో చేరుతున్నారని విలేకరులో అరవింద్ కేజ్రీవాల్ ముందు ప్రస్తావించారు. దీనికి ఆయన ఈ విధంగా స్పందించారు. ‘ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు పార్టీలు మారడం సర్వసాధారణం. ఎన్నికల ముందు పార్టీని పెంచుకోవాలని అనుకోవడమూ సహజమే. ఎమ్మెల్యేలు పార్టీ మారడం, ప్రత్యర్థి పార్టీల్లో చేరడమే పోటీ ఉన్నదని భావిస్తే.. ఆప్‌తో కనీసం 25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, ఇద్దరు ఎంపీలు టచ్‌లో ఉన్నారని విశ్వాసంగా చెప్పగలను. కానీ, మాకు వారి కచ్రా వద్దు’ అని పేర్కొన్నారు.

Also Read: ఆటో డ్రైవర్ నుంచి డిన్నర్ ఇన్విటేషన్.. వెంటనే అంగీకరించిన సీఎం..

గత ఆరు నెలల్లో రూపీందర్ కౌర్ సహా నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు ఆప్ నుంచి కాంగ్రెస్ పార్టీలు చేరారు. జూలైలో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సమక్షంలో ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పిర్మల్ సింగ్, జగదేవ్ సింగ్ కమలులూ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. గడిచిన నాలుగన్నర సంవత్సరాల్లో ఆప్ నుంచి సుమారు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీల్లోకి చేరారు. దీంతో పంజాబ్ అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యేల సంఖ్య 11కు పడిపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 20 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Also Read: అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నలతో రోస్ట్ చేసిన రైతులు.. మీటింగ్ మధ్య నుంచే తప్పుకున్న ఢిల్లీ సీఎం

పంజాబ్ పర్యటనలో తొలి రోజే అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలో సంచలనం సృష్టించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్‌లతో ఆయన సమావేశం కొత్త చర్చకు తెరలేపింది. లూధియానాలో నిన్న Auto Driverలు, క్యాబ్ డ్రైవర్లతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో ‘మీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరకు రండి’ అంటూ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ డిక్లేర్ చేశారు. వెంటనే ఆ డ్రైవర్‌ల నుంచి ఒకరు లేచి మైక్ తీసుకున్నారు. ‘ఈ రోజు రాత్రి ఈ పేద ఆటోవాలా ఇంటికి భోజనం చేయడానికి వస్తారా?’ అని అడిగారు. వెంటనే హాల్ అంతా చప్పట్లు, అరుపులతో దద్దరిల్లిపోయింది. ఈ Dinner Invitationకు అరవింద్ కేజ్రీవాల్ వెంటనే సమాధానమిచ్చారు. ఈ రోజేనా? అంటూ అడిగాడు. ఔనని సమాధనం రాగానే ‘ఓకే.. వస్తాను’ అంటూ చెప్పాడు. దీంతో హాల్‌లో గోల రెట్టింపు అయింది.

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu