కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు వీర్ చక్ర అవార్డు అందించడంపై పాకిస్తాన్ రియాక్షన్

By telugu teamFirst Published Nov 23, 2021, 5:59 PM IST
Highlights

భారత వాయుదళానికి చెందిన కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు వీర చక్ర అవార్డు అందించడంపై పాకిస్తాన్ రియాక్ట్ అయింది. కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు గ్యాలంట్రీ అవార్డు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. అసలు అక్కడ ఏమీ జరగలేదని, ఒక ఊహాత్మక ఫైట్‌కు గ్యాలంట్రీ అవార్డు ఇవ్వడం మిలిటరీ నిబంధనలకు విరుద్ధమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ జిల్లా Pulwamaలో 40 మంది సైనికులను పొట్టన బెట్టుకున్న Pakistanకు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ స్థావరాలపై భారత ప్రభుత్వం చేసిన మెరుపు దాడు(Surgical Stikes)ల్లో కీలక పాత్ర పోషించిన కమాండర్ అభినందన్ వర్ధమాన్‌(Abhinandan Varthaman)కు వీర్ చక్ర పురస్కారం లభించింది. ఈ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గ్రూప్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు అందించారు. బాలాకోట్ దాడుల్లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం అయ్యాయన్న విషయంపై పాకిస్తాన్ మొదటి నుంచీ విభేదిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, గ్రూప్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు వీర్ చక్ర పురస్కారం అందించడంపైనా ఆ దేశం స్పందించింది.

పాకిస్తాన్‌ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత పైలట్ నేల కూల్చాడన్న భారత ప్రభుత్వ వాదనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. ఈ వాదనను తాము తిరస్కరిస్తున్నామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు, భారత ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని ఆరోపించింది. అసలు సాహసమే లేదు అని, కేవలం ఊహాత్మక పోరాటాలకు గ్యాలంట్రీ అవార్డును ఇవ్వడం మిలిటరీ నిబంధనలకు విరుద్ధమని అని పేర్కొంది.

Also Read: కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర పురస్కారం.. రాష్ట్రపతి ప్రదానం

ఒక ఊహాత్మక ఘటనకు అవార్డును ప్రకటించి భారత్ ప్రభుత్వం తనను తానే అపహాస్యం చేసుకుందని ఆరోపణలు చేసింది. ఇప్పటికే ఆ అబద్ధం బట్టబయలు అయిందని, అయినప్పటికీ అవే అవాస్తవ వాదనలను ప్రచారం చేయడం
హాస్యాస్పదమని, నిర్హేతుకమని నోరుపారేసుకుంది.

2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో ఓ సూసైడ్ బాంబర్ కారులో బాంబుతో ప్రయాణించి పేల్చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించారు. ఈ ఘటనకు పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదం సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీనికి ప్రతీకారంగానే భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ బాలాకోట్‌లో ఖైబర్ పక్తుంక్వాలోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేపట్టింది. 

Also Read: బాలాకోట్‌ దాడుల హీరోకు ప్రమోషన్.. ఇక గ్రూప్ కెప్టెన్‌గా అభినందన్ వర్థమాన్

భారత వైమానిక దళ మెరుపు దాడుల తర్వాతి రోజు పాకిస్తాన్ నుంచీ సుమారు 24 యుద్ధ విమానాలు భారత సరిహద్దు వైపునకు బయల్దేరాయి. ఎల్‌వోసీ దాటి భారత గగనతలంలోకి వచ్చాయి.  భారత దేశ భూభాగంలో బాంబులు వేశాయి. ఇది గమనించి భారత వైమానిక దళం కూడా ఎదురెళ్లింది. అవి వెనుదిరిగాయి. ఓ ఎఫ్-16 విమానాన్ని టార్గెట్ చేసిన కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ దాన్ని తరుముకుంటూ వెళ్లాడు. అలా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లాడు. అంతేకాదు, ఆ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని నేలకూల్చాడు. అయితే, కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ విమానం కూడా దెబ్బతిన్నది. దీంతో ఆయన ప్యారాచూట్ సహాయంతో పాకిస్తాన్ భూభాగంలో దిగాడు. అక్కడి స్థానికులు ఆయనపై దాడి చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ అధికారులు ఆయనను బంధించారు.

click me!