భారత్‌-రష్యా మధ్య 21వ శిఖరాగ్ర సదస్సు.. కీల‌క ఒప్పందాల‌పై సంత‌కాలు

By team telugu  |  First Published Dec 6, 2021, 9:40 AM IST

భారత్ చిరకాల మిత్రదేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌.. నేడు (సోమ‌వారం) భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. సాయంత్రం 5:30 గంట‌ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రెండు దేశాలు ప‌లు కీలక ఒప్పందాల‌పై సంత‌కాలు చేయ‌నున్నాయ‌ని స‌మాచారం.
 


చాలా సంవ‌త్స‌రాల నుంచి భార‌త్‌, రష్యాల మ‌ధ్య బ‌ల‌మైన స్నేహ సంబంధాలున్నాయి.  ఈ నేప‌థ్యంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Russia President Putin) సోమవారం భారత పర్యటనకు రానున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రష్యా.. భారత్‌ మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలపడేలా దిశ‌గా భేటీ జరుగనుంది. వ్లాదిమిర్ పుతిన్.. ప్ర‌ధాని మోడీ  సోమవారం సాయంత్రం 5 గంట‌ల‌ 30 నిమిషాలకు సమావేశం కానున్నారు.

Also Read: పౌరుల ప్రాణాలకు రక్షణ లేదా? కేంద్ర హోంశాఖ ఏం చేస్తున్నట్టు : రాహుల్ గాంధీ

Latest Videos

undefined

భార‌త్ మిత్ర‌దేశ‌మైన ర‌ష్యాతో ప్ర‌తియేటా స‌మావేశాలు జ‌రుగుతాయి. ఇప్ప‌టివ‌ర‌కు రెండు దేశాల అధినేత‌లు చాలా సార్లు భేటీ అయ్యారు. ర‌ష్యా, భార‌త్‌ల మ‌ధ్య ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 20 వార్షిక శిఖ‌రాగ్ర స‌మావేశాలు జ‌రిగాయి.  ప్ర‌స్తుతం జ‌ర‌గ‌నున్న‌ది 21వ శిఖ‌,రాగ్ర స‌మావేశం. ఈ స‌మావేశానికి ఢిల్లీ వేదిక కానుంది. అయితే, రెండు దేశాధినేత‌ల మ‌ధ్య 21వ శిఖ‌రాగ్ర స‌మావేశం గ‌తేడాదే జ‌ర‌గాల్సి ఉన్న‌ది. అయితే, చైనాలోని వూహాన్ న‌గ‌రంలో క‌రోనా వైర‌స్ వెగులుచూడ‌టం, త‌క్కువ కాలంలోనే యావ‌త్ ప్ర‌పంచాన్ని చుట్టుముట్ట‌డం జ‌రిగిపోయింది. దీంతో గ‌తేడాది జ‌మావేశం జ‌ర‌గ‌లేదు. ప్ర‌స్తుతం భార‌త్‌లో క‌రోనా విజృంభ‌ణ కొద్దిగా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో నేడు ఇరు దేశాధినేత‌ల మ‌ధ్య భేటీ జ‌రుగుతోంది. 

Also Read: విదేశీ కంపెనీల చేత్తుల్లోకి తెలంగాణ భూ వివ‌రాలు.. రాముల‌మ్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఈ స‌మావేశంలో దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో జ‌ర‌గ‌నుంది. దీనిలో భాగంగా  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) నేడు నేరుగా ఢిల్లీకి రానున్నారు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అవుతారు. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క ఒప్పందాల‌పై ఇరు దేశాలు సంత‌కాలు చేయ‌నున్నాయి. వాటిలో  రక్షణ, వాణిజ్యం,  అంతరిక్షం, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక రంగాల‌కు చెందిన ఒప్పందాలున్నాయి. అలాగే, భార‌త ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేసే దిశ‌గా భార‌త్ ర‌క్ష‌ణ రంగ ప‌రిక‌రాల కొనుగోలు ఒప్పందాలు చేసుకోనుంద‌ని అధికార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా 200 హెలికాప్టర్ల తయారీ అంశంపై కూడా అవగాణ కుదుర్చుకోనున్నాయి.

Also Read: ఆ ఐదు రాష్ట్రాల్లో మహిళలపైనే రాజకీయ పార్టీల నజర్ ఎందుకు?

ఈ స‌మావేశంలో  రెండు దేశాలు దాదాపు 10 కీల‌క ఒప్పందాల‌పై సంత‌కాలు చేసే అవ‌కాశాలున్నాయ‌ని అధికారులు పేర్కొంటున్నారు.  భారత్‌ ఎంతగానో ఎదురు చూస్తున్న క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్‌-400ను మరింత వేగంగా అందించాలని భారత్‌ రష్యాను కోరే అవకాశం కూడా ఉంది. భార‌త్ ప‌ర్య‌ట‌న ముగిసిన అనంత‌రం రాత్రి  9.30 గంటలకు పుతిన్‌ రష్యాకు తిరిగి వెళ్ల‌నున్నారు. 

Also Read: సింగరేణి కాలనీ తరహాలో మరో ఘ‌టన.. ట్రంకుపెట్టెలో ఆరేళ్ల చిన్నారి..

రష్యా అధ్యక్షుడు పుతిన్ ప‌ర్య‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

10:30AM: ఇద్దరు విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం మరియు చర్చలు.

10.30AM: ఇద్దరు రక్షణ మంత్రుల మధ్య సమావేశం మరియు చర్చలు

11.30AM: భారతదేశం-రష్యా మధ్య మొదటి 2+2  భేటీ, దీనిలో ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రుల ప్రతినిధి బృందం చర్చలు.

3-4 PM: వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక విమానం ఢిల్లీ చేరుకుంటుంది.

సాయంత్రం 5: హైదరాబాద్‌ హౌస్‌లో ప్ర‌ధాని మోడీ-వ్లాదిమిర్ పుతిన్‌ భేటీ

5:30 PM: మోడీ-పుతిన్ చర్చలు ప్రారంభం

7.30PM: ప్రత్యేక విందు

8-9PM ఉమ్మడి ప్రకటన విడుదల

9.30PM – పుతిన్ రష్యాకు తిరిగి వెళ్లనున్నారు

Also Read: ఆ ఐదు రాష్ట్రాల్లో మహిళలపైనే రాజకీయ పార్టీల నజర్ ఎందుకు?

click me!