ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ‘‘లుంగీ’’ దుమారం.. వాళ్లంతా రౌడీలేనా అంటూ కాంగ్రెస్ ఆగ్రహం

By Siva KodatiFirst Published Dec 5, 2021, 9:34 PM IST
Highlights

యూపీ ఉప ముఖ్యమంత్రి (up deputy cm), బీజేపీ నేత కేశవ్ ప్రసాద్ మౌర్య (keshav prasad maurya) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.  2017 కంటే ముందు…లుంగీలు ధరించిన వారు వ్యాపారులను బెదిరించే వారని, లుంగీ, టోపీలు ధరించిన వారు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారంటూ వ్యాఖ్యానించారు. 

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh Elections) నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ (bjp), పాగా వేయాలని కాంగ్రెస్ (congress) ..ఇలా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా.. యూపీ ఉప ముఖ్యమంత్రి (up deputy cm), బీజేపీ నేత కేశవ్ ప్రసాద్ మౌర్య (keshav prasad maurya) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. 

ప్రయాగ్ రాజ్‌లో (prayag raj) ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో… కేశవ్ ప్రసాద్ మౌర్య పాల్గొన్నారు. 2017 కంటే ముందు…లుంగీలు ధరించిన వారు వ్యాపారులను బెదిరించే వారని, లుంగీ, టోపీలు ధరించిన వారు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారంటూ వ్యాఖ్యానించారు. స్థలాలు కబ్జాలు చేస్తూ.. దౌర్జన్యాలకు పాల్పడే వారంటూ కేశవ్ ప్రసాద్ అన్నారు. అయితే.. ప్రస్తుతం బీజేపీ అధికారంలోకి వచ్చాక.. అలాంటివి కనిపించడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Also Read:ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై అసదుద్దీన్ ఒవైసీ కీలక నిర్ణయం.. పార్టీ పోటీ చేసే స్థానాలపై ప్రకటన

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఆ పార్టీ సీనియర్ నేత రషీద్ అల్వీ (rashid alvi) మాట్లాడుతూ... లుంగీ ధరించిన వారంతా.. నేరస్థులేనా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఉండే హిందువుల్లో చాలా మంది లుంగీ ధరిస్తారని గుర్తుచేశారు. కొన్ని వర్గాలను టార్గెట్ చేస్తూ.. బీజేపీ రాజకీయాలు చేస్తోందని రషీద్ అల్వీ మండిపడ్డారు. బీజేపీ తీరును అక్కడి ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని .. దీని కారణంగానే ఓటమి భయం బీజేపీలో నెలకొందంటూ దుయ్యబట్టారు. 

click me!