ఇంకో పులిని పొట్టనబెట్టుకున్నారు.. ట్రాక్టర్‌తో తొక్కించి మరీ

sivanagaprasad kodati |  
Published : Nov 05, 2018, 11:08 AM IST
ఇంకో పులిని పొట్టనబెట్టుకున్నారు.. ట్రాక్టర్‌తో తొక్కించి మరీ

సారాంశం

మహారాష్ట్రలో అవని అనే ఆడపులిని గ్రామస్తులు దారుణంగా హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనను ఇంకా మరిచిపోకముందే ఉత్తరప్రదేశ్‌లో మరో పులిని చంపేశారు. 

మహారాష్ట్రలో అవని అనే ఆడపులిని గ్రామస్తులు దారుణంగా హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనను ఇంకా మరిచిపోకముందే ఉత్తరప్రదేశ్‌లో మరో పులిని చంపేశారు.

లక్నోకి 210 కిలోమీటర్ల దూరంలోని దుధ్వా టైగర్ రిజర్వ్ సమీపంలో పదేళ్ల వయసున్న ఓ పెద్దపులి.. ఆదివారం నాడు సమీప గ్రామంలోకి వెళ్లి... ఓ వ్యక్తిపై దాడి చేసింది. పులి దాడిలో అతను తీవ్రగాయాల పాలయ్యాడు..

అప్రమత్తమైన గ్రామస్తులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించారు. పులి కారణంగానే ఇతను చనిపోయాడని ఊగిపోయిన గ్రామస్తులు.. అటవీప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.

పుద్దపులి కనిపించగానే దానిని వేటాడి.. కొట్టి చంపి..ట్రాక్టర్‌తో తొక్కించి మరి చంపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది.. పులి మృత కళేబరాన్ని స్వాధీనం చేసుకుని... నిందితులపై కేసు నమోదు చేశారు.

కాగా, చనిపోయిన ఆడపులి గత పదేళ్లలో ఎన్నడూ ప్రజలపై దాడి చేయలేదని.. అడవులను అధికంగా నాశనం చేస్తున్న కారణంగానే వన్యప్రాణులు గ్రామాలపైకి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. 

‘అవని’ని కాల్చి చంపిన హైదరాబాద్ షూటర్
 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?