వికాస్ భారత్ సంకల్ప యాత్రకు జన నీరాజనాలు.. దేశవ్యాప్త పర్యటన గురించి తెలుసా?

By Mahesh KFirst Published Dec 8, 2023, 1:22 AM IST
Highlights

వికాస్ భారత్ సంకల్ప యాత్ర. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరగనున్న యాత్ర. కొండ ప్రాంతాల నుంచి మైదానాల వరకు, పట్టణాల నుంచి మారుమూల పల్లెటూరుల వరకు ఈ యాత్ర సాగుతున్నది. ప్రభుత్వ పథకాల గురించి అధికారులు సాధారణ ప్రజలకు ఈ యాత్రలో భాగంగా విడమర్చి చెబుతున్నారు.
 

Vikas Bharat Sankalp Yatra: వికాస్ భారత్ సంకల్ప యాత్ర కొండ ప్రాంతాల నుంచి మైదానాల వరకూ, పట్టణాల నుంచి దేశంలోని మారుమూల పల్లెల వరకు సాగుతున్నది. ప్రతి గ్రామానికి ఈ యాత్ర చేరుతున్నది. ప్రజలు పూల వర్షంతో ఈ యాత్రను స్వాగతిస్తున్నాయి. నవంబర్ 15వ తేదీన ఈ యాత్రను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.

న్యూ ఇండియా జంక్షన్ అనే యూట్యూబ్ చానెల్ ఈ వికాస్ భారత్ సంకల్ప యాత్ర గురించి ఓ వీడియోను పోస్టు చేసింది. గ్రామాల్లోకి ఈ యాత్ర ప్రవేశించడాన్ని, అధికారుల ద్వారా ప్రభుత్వ పథకానలు ప్రజలకు వివరిస్తున్న విధానాన్ని ఈ వీడియో చూపించింది.

Latest Videos

ఈ యాత్ర దేని గురించి?

భారత నలముూలల వరకు చేపడుతున్న ఒక అవగాహన యాత్రే ఈ వికాస్ భారత సంకల్ప యాత్ర. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 15వ తేదీన జార్ఖండ్‌లోని ఖైంటీ జిల్లాలో ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర వచ్చే ఏడాది జనవరి 25వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతల్లో అన్ని గ్రామ పంచాయతీలు, సుమారు 3,700 పట్టణ ప్రాంతాల్లో ఈ యాత్ర సాగుతుంది.

Also Read: IPL Auction: రచిన్ రవీంద్ర కోసం ‘హైదరాబాద్’ భారీగా పెట్టొచ్చు: ఇర్ఫాన్ పఠాన్

ఈ యాత్ర ద్వారా ప్రజలు తమకు రావాల్సిన, తాము లబ్దిదారులమయ్యే ప్రభుత్వ పథకాల గురించి వారిలో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం. తద్వార అర్హతలు ఉండి కూడా అలాంటి ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉండకుండా చేస్తుంది. ఈ యాత్ర, కేంద్ర, ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సహాయంతో ఈ యాత్ర సాగుతున్నది.

click me!