తమిళ నటుడు విజయ్ దళపతి ( Vijay Thalapathy) కొత్త పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. ఆయన పార్టీ పేరు కూడా దాదాపుగా ఖరారు అయిపోయింది (Tamizhaga Munnetra Kazhagam_TMK). పార్టీ గుర్తు, జెండాతో సహా పలు వివరాలను వచ్చే నెల మొదటి వారంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
తమిళ నటుడు విజయ్ దళపతి రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. అయితే ఆయన ఏ పార్టీలోనూ చేరకుండా కొత్త పార్టీ పెట్టబోతున్నారని సమాచారం. ఆ పార్టీకి పేరు కూడా ఖరారు అయ్యిందని తెలుస్తోంది. మరి కొన్ని నెలల్లో రాబోతున్న లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయబోతోంది.
అయోధ్యకు వెళ్లి వచ్చినందుకు ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ కు పత్వా, ప్రాణహాని..
లోక్ సభ ఎన్నికలకు ముందు నటుడు దళపతి విజయ్ స్థాపించబోయే రాజకీయ పార్టీకి ‘తమిళగ మున్నేట్ర కళగం (టీఎంకే)’ అని నామకరణం చేయనున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో పార్టీ పేరు, జెండాతో సహా పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని ‘హిందుస్థాన్ టైమ్స్’ పేర్కొంది.
విజయ్ దళపతి రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆయన పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేసింది.
డిసెంబర్ వరదలతో అతలాకుతలమైన తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో పర్యటించి బాధితులకు సహాయ సామాగ్రిని అందించారు. దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రంలో నటిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత సినిమాల్లో నటించడం మానేసి.. పూర్తిగా రాజకీయాలపైనే ఫొకస్ పెట్టాలని భావిస్తున్నారు.
ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు.. మీ జిల్లాకు ఎవరొచ్చారో తెలుసా ?
తాను 2026లో రాజకీయ అరంగేట్రం చేస్తానని విజయ్ గతంలోనే సంకేతాలిచ్చారు. అయితే వీలైనంత త్వరగా తన పార్టీ నమోదును ప్రారంభించాలని ఆయన అభిమానులు కోరినట్లు ‘ఇండియా టుడే’ గత వారం తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసే అవకాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.