అయోధ్యకు వెళ్లి వచ్చినందుకు ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ కు పత్వా, ప్రాణహాని..

By Sairam Indur  |  First Published Jan 30, 2024, 8:08 AM IST

అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైనందుకు ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ డాక్టర్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ (All India Imam Organisation Chief Imam Dr Umar Ahmad Ilyasi)పై ఫత్వా (Fatwa) జారీ చేశారు. క్షమాపణలు చెప్పాలని, పదవికి రాజీనామా చేయాలని ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అయితే తానేం తప్పు చేయలేదని, క్షమాపణ చెప్పబోనని ఇల్యాసీ తేల్చి చెప్పారు.


దేశంలోని హిందువులతో పాటు ప్రపంచ మొత్తం ఎదురు చూసిన అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22వ తేదీన ఘనంగా జరిగింది. అయితే అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ డాక్టర్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ పై ఫత్వా జారీ అయ్యింది. అలాగే ఆయనకు ఓ వర్గం నుంచి విపరీతమైన బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. 

Prashant Kishor: నితీశ్‌కు లాస్ట్ ఇన్నింగ్, లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్విప్: ప్రశాంత్ కిశోర్

Latest Videos

అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావాలంటూ దేశంలోని ప్రముఖులకు రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సుధీర్ఘ కాలం పాటు కొనసాగిన రామ జన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్ గా ఉన్న ఇక్బాల్‌ అన్సారీకి ఆయనతో పాటు ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ గా ఉన్న ఇమామ్‌ ఉమర్‌ అహ్మద్‌ ఇల్యాసీకి కూడా ట్రస్ట్ ఆహ్వానం అందించింది. దీంతో ఆయన ఈ వేడుకకు హాజరయ్యారు. కానీ ఇది ముస్లింలోని కొన్ని వర్గాలకు కోపం తెప్పించింది. 

ఈ విషయం స్వయంగా ఉమర్ అహ్మద్ ఇల్యాసీ  స్వయంగా వెల్లడించారు. సామరస్యం కోసం తాను చేసిన ఈ శుభకార్యానికి హాజరైనందుకు ఓ వర్గం నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. జనవరి 22వ తేదీన పవిత్ర పట్టణమైన అయోధ్యను సందర్శించినందుకు తనపై ద్వేశం చిమ్ముతున్నారని, వారందరూ పాకిస్థాన్ కు వెళ్లిపోవాలని ఇమామ్ సూచించారు. ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తాను ప్రయత్నించానని, దానికి క్షమాపణ చెప్పబోనని, తన పదవికి రాజీనామా చేయనని ఆయన అన్నారు.

ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు.. మీ జిల్లాకు ఎవరొచ్చారో తెలుసా ?

‘‘ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ గా ఉన్నందుకు నాకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం నుంచి ఆహ్వానం అందింది. దీనిపై నేను రెండు రోజులు ఆలోచించాను. సామరస్యం కోసం, దేశం కోసం అయోధ్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. దీంతో నిన్న (ఆదివారం) నాకు ఫత్వా జారీ చేశారు. కానీ వాస్తవానికి నాకు జనవరి 22 సాయంత్రం నుంచే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నాకు ప్రాణహాని కలిగించారు. కొన్ని కాల్స్ ను నేను రికార్డ్ చేశాను.’’ అని తెలిపారు.

సోషల్ మీడియాలో తనకు ఓ వ్యక్తి తనకు ఫత్వా జారీ చేశాడని, అందులో తన మొబైల్ నంబర్ ఉందని ఇమామ్ చీఫ్ తెలిపారు. తనను బహిష్కరించాలని ఇమామ్ లు, మసీదు అధికారులందరికీ దానిని పంపించాడని ఇల్యాసీ చెప్పారు. క్షమాపణలు చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని ఫత్వాలో పేర్కొన్నారని తెలిపారు.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మూడేసి స్థానాలకు ఎన్నికలు

అయోధ్యలో తనకు సాధువులతో పాటు పట్టణ ప్రజలు ఘన స్వాగతం పలికారని ఉమర్‌ అహ్మద్‌ ఇల్యాసీ చెప్పారు. ‘‘దేశంలో వేర్వేరు కులాలు, మతాల వారు ఉన్నారు. అందరి ఆరాధన విధానం, ఆచారాలు భిన్నంగా ఉండవచ్చు. విశ్వాసాలు కూడా వేరుగా ఉండవచ్చు. కానీ అన్నింటికంటే పెద్ద మతం మానవత్వమే. మనమందరం భారతీయులం. అందరం కలిసి భారతదేశాన్ని బలంగా చేయాలి.  చంద్రుడిపై భారత్ దిగింది. మారుతున్న ఈ భారతదేశంలో మనం ఐక్యంగా ఉండాలి. ’’ అని ఆయన అన్నారు.

click me!