లడఖ్ లో భూ ప్రకంపనలు..

By Sairam IndurFirst Published Jan 30, 2024, 9:05 AM IST
Highlights

లడఖ్ లో భూకంపం సంభవించింది. (Earthquake in Ladakh) మంగళవారం ఉదయం 5.39 గంటలకు లేహ్ ప్రాంతంలో ఒక్క సారిగా ప్రకంపనలు (Earthquake in Leh) సంభవించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Earthquake in Ladakh  : లడఖ్ లోని లేహ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఒక్క సారిగా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.4గా నమోదు అయ్యింది. 5.39 గంటలకు ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.

అయోధ్యకు వెళ్లి వచ్చినందుకు ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ కు పత్వా, ప్రాణహాని..

Latest Videos

ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్ట్ పెట్టింది. ‘‘భారత కాలమానం ప్రకారం 05.39.56 సమయంలో లడఖ్ లోని లేహ్ లో 3.4 తీవ్రతతో భూకంపం సంభించింది. లాట్: 35.27, పొడవు: 75.40 గా ఉంది.’’ అని పేర్కొంది. భూకంప కేంద్రం 5 కిలోమీటర్ల లోతులో ఉందని, 35.27 అక్షాంశాలు, 75.40 రేఖాంశాల వద్ద సంభవించిందని తెలిపింది.

Earthquake of Magnitude:3.4, Occurred on 30-01-2024, 05:39:56 IST, Lat: 35.27 & Long: 75.40, Depth: 5 Km ,Region: Leh, Ladakh for more information Download the BhooKamp App https://t.co/W04hUQwBeU pic.twitter.com/6vm1m0RKWc

— National Center for Seismology (@NCS_Earthquake)

ఇదిలా ఉండగా.. తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలోనూ శనివారం భూకంపం సంభవించింది. జిల్లాలోని న్యాల్ కల్, ముంగితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో ప్రకంపనలు వచ్చాయి. దీంతో స్థానికులు ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యారు. ఏ జరుగుతుందో తెలియక భయపడ్డారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనలకు సంబంధించి స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు.. మీ జిల్లాకు ఎవరొచ్చారో తెలుసా ?

భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీనినే భూకంపం అని అంటారు.

click me!