బాలికపై 24 మంది వంతులవారీ రేప్: మొదటోడు ఆ ముసలోడే

First Published Jul 19, 2018, 8:51 AM IST
Highlights

అత్యంత దారుణమైన అత్యాచారం కేసులో బాధితురాలు వృద్ధుడి అఘాయిత్యాన్ని బయటపెట్టింది. తనపై ఏడు నెలల పాటు 24 మంది వంతులవారీగా అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను ఆమె గుర్తించింది. 

చెన్నై: అత్యంత దారుణమైన అత్యాచారం కేసులో బాధితురాలు వృద్ధుడి అఘాయిత్యాన్ని బయటపెట్టింది. తనపై ఏడు నెలల పాటు 24 మంది వంతులవారీగా అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను ఆమె గుర్తించింది.  తమ క్వార్టర్స్‌లో లిఫ్ట్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న 66 ఏళ్ల వృద్ధుడే తనపై మొదటిసారి అత్యాచారం జరిపాడని తెలిపింది. 

లిఫ్ట్‌ ఆపరేటర్‌, సెక్యూరిటీ గార్డులు, ప్లంబర్లు, ఎలక్ర్టీషియన్లు సహా 24 మంది తాము పనిచేస్తున్న క్వార్టర్స్‌లో ఉంటున్న 12 ఏళ్ల చెవిటి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. సోమవారం బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు బుధవారం పోలీసు కమిషనరేట్‌కు తీసుకుని వచ్చారు. అక్కడ నిందితులను ఆమె గుర్తించింది. 

తన పట్ల ఎవరెవరు ఎంత నీచానికి ఒడిగట్టారనే విషయాన్ని ఆమె వివరించింది. ఆ తర్వాత ఆమెను హైకోర్టుకు తీసుకెళ్లారు. నిందితులకు చట్టప్రకారం తప్పకుండా శిక్ష పడుతుందని మద్రాస్‌ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ అన్నారు.
 
అక్కడినుంచి ఆ బాలికను చెన్నై ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు ప్రత్యేకవార్డులో వైద్య పరీక్షలను కొనసాగిస్తున్నారు. ఆమె ఆరోగ్యంపై త్వరలోనే నివేదిక ఇస్తామని వైద్యులు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో వారందరిని పుళల్‌ జైలుకు తరలించారు. 

మిగిలిన ఏడుగురిని పట్టుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేసింది.  నిందితుల తరపున వాదించేందుకు న్యాయవాదులు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. నిందితులపై కోర్టు ఆవరణలో న్యాయవాదులు దాడికి దిగిన విషయం కూడా తెలిసిందే.

click me!