సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వినోద్ దువా ఇక‌లేరు..

By team teluguFirst Published Dec 4, 2021, 7:03 PM IST
Highlights

ప్ర‌ముఖ‌ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వినోద్ దువా (67) శ‌నివారం మ‌ర‌ణించారు. గ‌త కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఢిల్లీ హాస్పిట‌ల్ లో ఈ రోజు సాయంత్రం క‌న్నుమూశారు.
 

Journalist Vinod Dua: ప్ర‌ముఖ‌ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వినోద్ దువా (67) శ‌నివారం మ‌ర‌ణించారు. గ‌తేడాది ప్రారంభంలో ఆయ‌న‌కు క‌రోనా సోకింది. దీంతో ఆయ‌న ఆరోగ్యం దెబ్బ తిన్న‌ది.  దీంతో గ‌త కొద్దిరోజులుగా ఆయ‌న ఢిల్లీ హాస్పిట‌ల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్ర‌మంలో ప‌రిస్థితి విష‌మించి ఈ రోజు సాయంత్రం క‌న్నుమూశారు.

ఈ మ‌ర‌ణ వార్త‌ను ఆయ‌న కుమార్తె మల్లికా దువా సోష‌ల్ మీడియా వేదికగా వెల్ల‌డించింది. త‌న తండ్రి ఇప్పుడూ పై లోకంలో ఉన్న త‌న అమ్మ ద‌గ్గ‌రికి వెళ్లిపోయాడ‌ని చెప్పుకొచ్చింది. ఆయ‌న అంత్య‌క్రియ‌లు ఢిల్లీ లోని లోధి శ్మశానవాటికలో ఆదివారం జరుగుతాయని తెలిపారు. క‌రోనా సెకండ్ వేవ్‌లో వినోద్ దువా, ఆయ‌న‌ భార్య ప‌ద్మావ‌తి దువా వైర‌స్ బారిన ప‌డ్డారు. కానీ, వినోద్ దువా కొలుకున్నా..  ప‌ద్మావ‌తి దువా మాత్రం ఈ ఏడాది జూన్‌లో క‌న్నుమూశారు. దువాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Read Also: https://telugu.asianetnews.com/entertainment-news/kannada-senior-actor-and-director-sivaram-passed-away-r3ld6e

జ‌ర్న‌లిజం కెరీర్‌లో త‌న‌కు అపార అనుభ‌వం ఉంది. ఆయ‌న దూర‌ద‌ర్శ‌న్‌, ఎన్‌డీటీవీల్లో దీర్ఘ‌కాలం ప‌నిచేశారు. అలాగే..  ఇత‌ర టీవీ చానెళ్లు, ఆన్‌లైన్ పోర్ట‌ల్స్‌లో అనేక షోలు నిర్వ‌హించారు. త‌న 42 యేండ్ల జ‌ర్న‌లిజం కేరీర్ లో ఎన్నో అటుపోట్లును ఎదుర్కొన్నారు. ప్ర‌ధాని మోడీ పై ప‌లు వ్యాఖ్య‌లు చేశార‌న్న ఆరోపణలపై గతేడాది మేలో ఆయనపై దేశద్రోహం సహా పలు ఇతర కేసులు నమోదయ్యాయి. అయితే.. ఇటీవ‌లే ఈ కేసును సుప్రీం కోర్టు చెల్లదని కొట్టివేసింది.
 

click me!