‘‘ మీరు చాలా అందంగా వున్నారు ’’... మహిళా ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు, వివాదంలో బీహార్ సీఎం నితీష్ కుమార్

By Siva KodatiFirst Published Dec 4, 2021, 5:41 PM IST
Highlights

జేడీయూ (jdu) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి (bihar cm) నితీశ్ కుమార్ (nitish kumar) వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీ మహిళా గిరిజన ఎమ్మెల్యే నిక్కీ హేంబ్రామ్‌పై (nikki hembrom) ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపుతున్నాయి. మీరు చాలా అందంగా ఉన్నారు, కానీ గిరిజనుల కోసం మేము చేపట్టిన ఉపాధి కార్యక్రమాలు మీకు తెలియదంటూ వ్యాఖ్యానించారు. 

జేడీయూ (jdu) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి (bihar cm) నితీశ్ కుమార్ (nitish kumar) వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బీహార్ శాసనసభ శీతాకాల సమావేశాల (bihar assembly winter session 2021) నేపథ్యంలో గత సోమవారం ఎన్డీయే లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ మహిళా గిరిజన ఎమ్మెల్యే నిక్కీ హేంబ్రామ్‌పై (nikki hembrom) ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపుతున్నాయి. అయితే నిజానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్యం నిషేధం గురించి మాట్లాడారని... అదే సమయంలో నిక్కీ హెంబ్రామ్ మహువా సాగులో ఉన్న ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అయితే నిక్కీ మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆమెను అడ్డుకొని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. మీరు చాలా అందంగా ఉన్నారు, కానీ గిరిజనుల కోసం మేము చేపట్టిన ఉపాధి కార్యక్రమాలు మీకు తెలియదంటూ వ్యాఖ్యానించారు. 

వ్యవహారంపై నిక్కీ హేంబ్రామ్..బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. నితీష్ ప్రవర్తనతో తాను చాలా బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చెప్పిన విషయాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని, దానిపై పదే పదే మాట్లాడటం సరికాదంటూ నిక్కీ అన్నారు. అయితే నితీష్ కుమార్‌ కుమార్‌కు జేడీయూ నేత లేసీ సింగ్ (lesi singh) అండగా నిలిచారు. మహిళా ఎమ్మెల్యేను కించపరచాలనే ఉద్దేశంతో సీఎం ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఆయనకు మహిళలంటే చాలా గౌరవమని అన్నారు. మరోవైపు ఈ వివాదంపై ప్రతిపక్ష ఆర్జేడీ (rjd) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) కుమార్తె రోహిణి (rohini acharya) కూడా ట్వీట్ ద్వారా నితీశ్‌పై విరుచుకుపడ్డారు. ఈ వయసులో కూడా చాచా అపఖ్యాతి పాలయ్యాడంటూ రాసుకొచ్చారు.

click me!